టెస్లా విద్యుత్ కార్లను బిట్‌కాయిన్ ద్వారా కొనుగోలు చేయొచ్చని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. ప్రస్తుతం అమెరికాలోనే అందుబాటులో ఉన్న ఈ సదుపాయాన్ని ఏడాది తర్వాత ఇతర దేశాల్లోని వారికీ వర్తింపజేస్తామని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. టెస్లా కార్ల కోసం చెల్లించిన బిట్కాయిన్లను తిరిగి సంప్రదాయ కరెన్సీలోకి మార్చుకోబోమని వివరించారు.
'బిట్కాయిన్తోనూ టెస్లా కారు కొనొచ్చు' - బిట్‌కాయిన్
టెస్లా కార్లను బిట్‌కాయిన్ ద్వారా కొనుగోలు చేయొచ్చని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సదుపాయం అమెరికాలోనే ఉందని అన్నారు.
'బిట్కాయిన్తోనూ టెస్లా కారు కొనొచ్చు'
గత నెలలో 1.5 బిలియన్ డాలర్ల విలువైన బిట్కాయిన్లను టెస్లా కొనుగోలు చేసింది. ఈ పరిణామం తర్వాత బిట్‌కాయిన్ విలువ మరింతగా పెరిగింది. మరోవైపు ట్విటర్ ఖాతా ద్వారా క్రిప్టోకరెన్సీలకు మరింతగా ప్రచారాన్ని ఎలాన్ మస్క్ చేపడుతున్నారు.
ఇదీ చదవండి:'10 గ్రాముల పసిడీ డిపాజిట్ చేయొచ్చు'