బడ్జెట్ ధరల్లో స్మార్ట్ఫోన్లు అందించే చైనా దిగ్గజ మొబైల్ సంస్థ షియోమీ నుంచి మరో కొత్త మొబైల్ భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. వెనుకవైపు 108 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరాతో రూపొందించిన ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్‌ను మే 8న దేశీయ విపణిలో విడుదల చేసేందుకు సిద్ధమైంది షియోమీ. ఇప్పటికే చైనా మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
రేపు భారత మార్కెట్లోకి ఎంఐ 10 స్మార్ట్ ఫోన్
మొబైల్ దిగ్గజం షియోమీ మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. బడ్జెట్ స్మార్ట్ఫోన్లను తీసుకొస్తూ యువతకు దగ్గరైన ఈ సంస్థ మే 8న 'ఎంఐ 10' ఫోన్‌ను దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలను తెలుసుకుందామా?
మే 8న మార్కెట్లోకి రానున్న ఎంఐ 10 స్మార్ట్ ఫోన్
ఎంఐ 10 ప్రత్యేకతలు ఇవే..
- 6.67 అంగుళాల పూర్తి హెచ్డీ, సూపర్ అమోలెడ్ డిస్ప్లే
- స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్
- వెనుకవైపు నాలుగు కెమెరాలు (108 ఎంపీ+13ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
- 20 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 4,780 ఎంఏహెచ్ బ్యాటరీ
- 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్
మే 8న ఎంఐ 10 మొబైల్‌తో పాటు ఇయర్ బడ్స్‌ను కూడా అందించనుంది షియోమీ.