చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ తయారీదారు షియోమీ.. భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం కొత్తగా ఎంఐ క్రెడిట్ లెండింగ్ ప్లాట్‌ఫాంను అధికారికంగా ప్రారంభించింది. ఇప్పటివరకు ఎంఐ క్రెడిట్‌ను ప్రయోగాత్మకంగా నడిపింది.
దీని ద్వారా వినియోగదారులు రూ.1 లక్ష వరకు రుణాలు పొందవచ్చు. 'క్రెడిట్‌బీ' భాగస్వామ్యంతో రుణాలివ్వనున్నట్లు గతేడాది ప్రకటించిన షియోమీ... ప్రస్తుత ఫార్మాట్లో అది లేదని వెల్లడించింది. వినియోగదారులకు రుణాలు ఇచ్చేందుకు ఆదిత్య బిర్లా ఫైనాన్స్, మనీ వ్యూ, ఎర్లీ సాలరీ, క్రెడిట్ విద్య, జెస్ట్ మనీ తదితర ఫైనాన్స్ కంపెనీలతో భాగస్వామ్యం అయింది.