కరోనాపై పోరులో భాగంగా ప్రపంచ బ్యాంకు భారత్కు భారీ సాయం ప్రకటించింది. కరోనాపై భారత్ చేస్తున్న సామాజిక రక్షణ ప్రతిస్పందన కార్యక్రమానికి ఊతమిచ్చేందుకు 1 బిలియన్ డాలర్లు (రూ.7,500 కోట్లు) అందించేందుకు అంగీకరించింది.
భారత్కు ప్రపంచ బ్యాంకు రూ.7,500 కోట్ల సాయం - corona virus world bank
11:01 May 15
భారత్కు భారీ సాయం ప్రకటించిన ప్రపంచ బ్యాంకు
పేదలు, సంక్షోభంలో చిక్కుకున్న కుటుంబాలతో పాటు వైరస్ వల్ల ప్రభావితమైనవారికి సామాజిక సాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
వివిధ బ్యాంకుల సహకారంతో..
ఇందులో 550 మిలియన్ డాలర్లను ప్రపంచ బ్యాంకుకు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి సంఘం (ఐడీఏ) నుంచి రుణంగా పొందింది. 200 మిలియన్ డాలర్లను ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (ఐబీఆర్డీ) నుంచి అందించింది. మిగిలిన 250 మిలియన్ డాలర్లు జూన్ 30 వరకు అందజేయనుంది.
భారత్లో వైద్య రంగానికి మద్దతుగా గత నెల 1 బిలియన్ డాలర్లు ప్రకటించింది ప్రపంచబ్యాంకు. ఫలితంగా భారత్లో కరోనా అత్యవసర స్పందన కింద ప్రపంచ బ్యాంకు ఇప్పటివరకు 2 బిలియన్ డాలర్లు సాయం చేసింది.