దేశవ్యాప్తంగా కరోనా టీకాల కొరత వేధిస్తున్న సమయంలో దేశీయ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన వాక్‌హార్డ్ కీలక ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఏటా 200 కోట్ల టీకా డోసుల్ని తయారు చేయగల సామర్థ్యం తమకు ఉందని పేర్కొంది. 2022 ఫిబ్రవరి నుంచి యాభై కోట్లతో ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి వాక్‌హార్డ్ తెలియజేసినట్లు ఓ జాతీయ పత్రిక పేర్కొంది. ఏ కంపెనీల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాలో గుర్తించి.. వాటితో భాగస్వామ్యం ఏర్పరచుకోవడంలో ప్రభుత్వ సహకారం కావాలని కోరింది.
ఇప్పటికే కొవిడ్-19 టీకాల ఉత్పత్తికి కావాల్సిన సాంకేతికతను వాక్‌హార్డ్ సమకూర్చుకుంటున్నట్లు సమాచారం. ఎంఆర్‌ఎన్‌ఏ, ప్రోటీన్ ఆధారిత, వైరల్ వెక్టర్ ఆధారిత ఇలా పలు సాంకేతికతల ఆధారంగా రూపొందించిన వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడమేగాక, అవసరమైన పరిశోధనలు చేపట్టడానికి కావాల్సిన సామర్థ్యం తమ సంస్థకు ఉందని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:టీకాలు ఇచ్చేందుకు ఫైజర్ రెడీ.. కానీ!
ఇదీ చదవండి:'మా టీకా పిల్లలపై పనిచేస్తోంది'