సవరించిన స్థూల రాబడి(ఏజీఆర్) బకాయిల పునర్లెక్కింపుపై ఒక్క సెకను కూడా వాదనలు వినబోయేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఏజీఆర్ బకాయిలను వాయిదాల్లో చెల్లించడానికి సంబంధించిన గడువుపై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.
మీరే తేల్చుకోండి!
అంతకుముందు.. బకాయిలు చెల్లించేందుకు టెలికాం సంస్థలకు 20 సంవత్సరాల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కేంద్రం అభ్యర్థించింది. అయితే 15-20 సంవత్సరాలు గడువు ఇవ్వడం సహేతుకం కాదని, తగిన టైమ్టేబుల్తో టెలికాం సంస్థలే ముందుకు రావాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
టెలీకాం సంస్థలు దివాలాకు వెళ్తున్న పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో సంస్థలపై నమ్మకం కలిగించే విధంగా చెల్లింపులు చేపట్టాలని సూచించింది. దీంతో పాటు టెలికాం కంపెనీలు గత 10 సంవత్సరాల ఖాతాలను సమర్పించాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:'మరో రూ.వెయ్యి కోట్ల ఏజీఆర్ బకాయి చెల్లించాం'