తెలంగాణ

telangana

ETV Bharat / business

వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక! మోడ్​​ యాప్​ వాడితే అంతే.. - What is WhatsApp mods

వాట్సాప్​ తమ యూజర్లకు కీలక సూచనలు చేసింది. ఇటీవల వాట్సాప్​ను వినియోగించుకుని సైబర్ నేరాలు పెరిగిపోయిన నేపథ్యంలో.. మోడ్​ యాప్స్ (WhatsApp mods)​ వాడొద్దని సూచించింది​. ఏమిటి ఈ మోడ్​ యాప్స్​? వీటితో వచ్చే సమస్యలు ఏమిటి? అనే విషయాలు మీకోసం.

WhatsApp modes
వాట్సాప్​ మోడ్స్​

By

Published : Aug 28, 2021, 10:55 AM IST

Updated : Aug 28, 2021, 11:16 AM IST

సైబర్‌ నేరగాళ్ల బారి (Cyber crimes) నుంచి తప్పించుకునేందుకు వాట్సాప్​ తన యూజర్స్‌కు కీలక సూచనలు చేసింది. ఇందులో భాగంగా వాట్సాప్ యూజర్స్ వాట్సాప్ మోడ్ (WhatsApp mods) యాప్స్‌ను ఉపయోగించొద్దని సూచించింది. ఇంతకీ మోడ్ యాప్స్‌ అంటే ఏంటి? వాటిని ఉపయోగిస్తే ఏమవుతుంది? వాట్సాప్ ఎందుకు మోడ్‌ యాప్స్‌ని ఉపయోగించొద్దని చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

వాటిలో సెక్యూరిటీ ఫీచర్స్ లేవు..

మోడ్‌ యాప్స్‌ లేదా మోడిఫైడ్ యాప్స్‌లో సాధారణ యాప్స్‌లో ఉండే ఫీచర్స్‌ కంటే కొన్ని రకాల ఫీచర్స్ అదనంగా ఉంటాయి. అయితే ఇవి ఆమోదయోగ్యమైనవి కాదని వాట్సాప్ చెబుతోంది. సాధారణ యాప్స్ కంటే మోడ్ యాప్స్ ఎక్కువ ఫీచర్స్‌ని అందిస్తున్నప్పటికీ, వీటిలోని భద్రతాపరమైన లోపాల కారణంగా హ్యాకర్స్‌ యూజర్‌ ఫోన్లలోని సమాచారాన్ని సులువుగా దొంగిలిస్తున్నారని తెలిపింది. వాట్సాప్‌లో ఉన్న విధంగా మోడ్ యాప్స్‌లో సెక్యూరిటీ ఫీచర్స్‌ ఉండవని పేర్కొంది. అందుకే యూజర్స్ వాట్సాప్ మోడ్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని సూచిస్తోంది.

ఆ వెర్షన్​లో టార్జన్​ ట్రియాడా..

వాట్సాప్ మోడ్‌ యాప్స్‌లో ఎఫ్‌ఎండబ్ల్యూ వాట్సాప్‌ 16.80.0లో టార్జాన్ ట్రియాడా వైరస్‌ ఉన్నట్లు గుర్తించామని వాట్సాప్‌ తెలిపింది. ఈ వెర్షన్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన వెంటనే ఇందులోని వైరస్‌ ఫోన్‌లోని మొత్తం సమాచారాన్ని హ్యాకర్స్‌కి చేరవేస్తోందని కాస్పర్‌స్కై అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఫోన్‌లలో స్క్రీన్‌ మొత్తం కనిపించేలా ప్రకటనలు ఇవ్వడం, సబ్‌స్క్రిప్షన్ ఖాతాల్లోకి యూజర్ ప్రమేయం లేకుండా లాగిన్ కావడం, బ్యాంక్‌ ఖాతాల్లోకి ప్రవేశించడం వంటివి తాము గుర్తించినట్లు కాస్పర్‌స్కై పేర్కొంది. అందుకే యూజర్స్ మోడ్ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవద్దని వాట్సాప్ సూచిస్తోంది. అలానే ప్లేస్టోర్ నుంచి కొత్తగా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే మందు అవి అధీకృతమైనవా? కాదా? అనేది పరిశీలించాలని తెలిపింది.

ఇదీ చదవండి:WhatsApp Updates:వాట్సాప్​లో ఫేస్​బుక్ తరహా కొత్త ఫీచర్​

Last Updated : Aug 28, 2021, 11:16 AM IST

ABOUT THE AUTHOR

...view details