తెలంగాణ

telangana

ETV Bharat / business

వాట్సప్‌ గోప్యతపై విచారణ.. మరో ధర్మాసనానికి! - వాట్సాప్​ గోప్యత

ఫేస్‌బుక్‌, వాట్సప్‌లు దిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. గోప్యత నిబంధనలపై విచారణ జరపాలన్న సీసీఐ ఆదేశాలను సవాల్​ చేశాయి. వీటిపై జస్టిస్‌ ప్రతిభా ఎం సింగ్‌ విచారణ చేపట్టాల్సి ఉండగా, అందుకు ఆ న్యాయమూర్తి నిరాకరించారు.

whatsapp, facebook move delhi high court
వాట్సప్‌ గోప్యతపై విచారణ.. మరో ధర్మాసనానికి!

By

Published : Apr 9, 2021, 5:20 AM IST

తమ అప్లికేషన్ల గోప్యతా నిబంధనలపై విచారణ చేపట్టాలన్న 'కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)' ఆదేశాలను సవాలుచేస్తూ ప్రముఖ సామాజిక మాధ్యమ వేదికలు ఫేస్‌బుక్‌, వాట్సప్‌లు దిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్‌ ప్రతిభా ఎం సింగ్‌ విచారణ చేపట్టాల్సి ఉండగా, అందుకు ఆ న్యాయమూర్తి నిరాకరించారు. ఈ పిటిషన్లపై తాను విచారణ చేపట్టబోనని, ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలను అనుసరించి ఈనెల 12న మరో ధర్మాసనం ముందుకు వీటికి తీసుకురావాలని హైకోర్టు రిజిస్ట్రీకి సూచించారు.

వాట్సప్‌ గోప్యతా విధానంపై విచారణ చేపట్టాలని, 60 రోజుల్లోగా దీన్ని పూర్తిచేయాలంటూ గత నెల 24న సీసీఐ ఆదేశాలిచ్చింది. వీటిని ఫేస్‌బుక్‌, వాట్సప్‌లు సవాలు చేశాయి. వాట్సప్‌ గోప్యతా విధానంపై ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణ చేపడుతున్నందున.. మళ్లీ ఇదే విషయమై సీసీఐ వేరుగా ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయా సంస్థలు పేర్కొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details