తెలంగాణ

telangana

ETV Bharat / business

వొడాఫోన్​-ఐడియా షేర్లు 39శాతం పతనం

వొడాఫోన్ ఐడియా షేర్లు ఇవాళ 39 శాతం మేర నష్టపోయాయి. మరోవైపు ప్రారంభ నష్టాల నుంచి తేరుకున్న భారతీ ఎయిర్​టెల్... ప్రస్తుతం స్వల్పలాభాల్లో కొనసాగుతోంది. ఏజీఆర్ తీర్పును పునఃసమీక్షించాలని ఎయిర్​టెల్​, వొడాఫోన్ ఐడియా వేసిన పిటిషన్లు సుప్రీంకోర్టు తోసిపుచ్చడం ఇందుకు కారణం.

Vodafone Idea shares nosedive over 39 pc
వొడాఫోన్​-ఐడియా షేర్లు 39శాతం పతనం

By

Published : Jan 17, 2020, 12:35 PM IST

ఏజీఆర్ తీర్పును పునఃసమీక్షించాలని ఎయిర్​టెల్​, వొడాఫోన్ ఐడియా వేసిన పిటిషన్లు సుప్రీంకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేర్లు ఇవాళ 39 శాతం మేర నష్టపోయాయి. ప్రారంభ నష్టాల నుంచి తేరుకున్న భారతీ ఎయిర్​టెల్... ప్రస్తుతం స్వల్పలాభాల్లో కొనసాగుతోంది.

ఏజీఆర్‌ తీర్పును పునఃసమీక్షించాలని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు వేసిన పిటిషన్లను గురువారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గత తీర్పును సమీక్షించాల్సిన అవసరమేమీ లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ టెలికం కంపెనీలు రూ.1.47 లక్షల కోట్ల బకాయిలను జనవరి 23లోగా ప్రభుత్వానికి చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

కష్టమే

"సుప్రీంతీర్పు వల్ల ఈ మూడు టెలికాం సంస్థలపై తీవ్ర భారంపడే అవకాశం ఉంది. ఇది అనూహ్య పరిణామాలకు దారితీయొచ్చు. ముఖ్యంగా వొడాఫోన్​ ఐడియా మూతపడే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. చందాదారులు కూడా భారీగా నష్టాలపాలవుతారు." - ఓ నివేదిక

మినహాయింపు కావాలి ప్లీజ్​

టెలికం సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి సుమారు రూ.92వేల కోట్ల మేర సవరించిన స్థూల ఆదాయం(ఏజీఆర్‌) వసూలు చేసేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. దీంట్లో అత్యధికంగా ఎయిర్‌టెల్‌ రూ.21,682.13కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.19,823కోట్లు, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ రూ.16,456కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ రూ.2,537కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2,098కోట్లు బకాయి పడ్డాయి. వీటిపై వడ్డీలు, అపరాధ రుసుంలు కలిపి మొత్తం రూ.92,641కోట్లకు చేరాయి. వీటికి తోడు మరో రూ.55,054కోట్లు స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు కలిశాయి. మొత్తం రూ.1.47లక్షల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అపరాధ రుసుం, వడ్డీ నుంచి మినహాయించాలని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ఇదీ చూడండి: 'అమెజాన్​ ప్రైమ్ వీడియో' ఇక మరింత శక్తిమంతం

ABOUT THE AUTHOR

...view details