తెలంగాణ

telangana

ETV Bharat / business

విజయ్ మాల్యా ఎప్పటికీ బ్రిటన్​లోనే? - preeti patel britain home minister

భారతీయ బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి బ్రిటన్​లో తలదాకున్న విజయ్ మాల్యా శాశ్వతంగా అక్కడే ఉండేలా పావులు కదుపుతున్నాడు. మనీలాండరింగ్​ కేసులో కోర్టులకు హాజరవుతూనే.. భారత్​కు అప్పగించొద్దని బ్రిటన్ హోంశాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలొచ్చాయి.

Vijay Mallya appeals to UK Home Secy for another route to stay in the UK
విజయ్ మాల్యా ఎప్పటికీ బ్రిటన్​లోనే??

By

Published : Jan 23, 2021, 8:46 AM IST

బ్రిటన్‌లో తలదాచుకుంటున్న భారతీయ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా ఎప్పటికీ భారత్‌కు రాకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌ను ఆయన శరణు కోరినట్లు వస్తున్న ఊహాగానాలకు తాజాగా మరింత బలం చేకూరింది.

మరోమార్గంలో..

దివాలా వ్యవహారానికి సంబంధించిన ఓ కేసులో ఆయన తరఫు న్యాయవాది ఫిలిప్‌ మార్షల్‌ శుక్రవారం లండన్‌ హైకోర్టులో విచారణకు హాజరయ్యారు. 'మరో మార్గం' ద్వారా బ్రిటన్‌లోనే ఉండేలా హోం మంత్రి ప్రీతీ పటేల్‌కు మాల్యా దరఖాస్తు చేసుకున్నట్లు మార్షల్‌ ధ్రువీకరించారు. భారత్‌కు తనను అప్పగించొద్దని విన్నవిస్తూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను బ్రిటన్‌ సుప్రీం కోర్టు గత ఏడాదే కొట్టివేసింది. అయితే ఆ దేశ హోంశాఖ నుంచి అనుమతుల మంజూరు ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో అప్పగింత వ్యవహారం ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

మాల్యాకు సంబంధించి రహస్య న్యాయ ప్రక్రియ కొనసాగుతోందంటూ ఇటీవల హోంశాఖ పేర్కొనడంతో.. ఆయన శరణార్థిగా ఉండేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.

ఇదీ చదవండి:నీరవ్​ మోదీ కేసులో ఫిబ్రవరి 25న తుది తీర్పు

ABOUT THE AUTHOR

...view details