తెలంగాణ

telangana

ETV Bharat / business

చెంగల్‌పట్టులో కొవాగ్జిన్​ టీకా ఉత్పత్తికి అనుమతులు! - తమిళనాడులో కొవాగ్జిన్​ ఉత్పత్తి

తమిళనాడులోని చెంగల్​పట్టులో కొవాగ్జిన్​ టీకాను ఉత్పత్తి చేసేందుకు భారత్‌ బయోటెక్‌ సంస్థకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

COVAXIN
కొవాగ్జిన్​

By

Published : Jul 15, 2021, 6:54 AM IST

తమిళనాడులోని చెంగల్‌పట్టు హెచ్‌ఎల్‌ఎల్‌ టీకా ఉత్పత్తి కేంద్రంలో కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేపట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 2017లో రూ.700 కోట్లతో నిర్మాణం పూర్తయిన ఈ కేంద్రంలో ఏటా 5.85 కోట్ల డోసుల టీకా ఉత్పత్తికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. నిర్మాణం పూర్తయినా ఇప్పటివరకు ఉత్పత్తి ప్రారంభం కాలేదు. దీన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు డీఎంకే ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో గురువారం దిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ భేటీ కానున్నారు. చెంగల్‌పట్టు టీకా కేంద్రం గురించి రాష్ట్రమంత్రి ఒత్తిడి తేనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు సంస్థలు ఇక్కడ టీకా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వీటిలో కొవాగ్జిన్‌ టీకా ఉత్పత్తిదారైన భారత్‌ బయోటెక్‌ సంస్థకు అనుమతి ఇచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉందన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర మంత్రుల భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

ఇదీ చూడండి:డబ్ల్యూహెచ్‌ఓకు కీలకపత్రాలు సమర్పించిన భారత్​ బయోటెక్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details