తెలంగాణ

telangana

ETV Bharat / business

వారాంతంలో లాభాలు

కొనుగోళ్ల మద్దతుతో వారాంతంలో స్టాక్​ మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. దేశ సరిహద్దులో సద్దుమణుగుతున్న పరిస్థితులు లాభాలకు ఓ కారణం.

వారాంతంలో లాభాలు

By

Published : Mar 1, 2019, 5:45 PM IST

దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు శాంతించిన కారణంగా వరుసగా మూడు రోజుల మార్కెట్ల నష్టాలకు బ్రేక్​ పడింది. వారాంతంలో స్టాక్​ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 196.37 పాయింట్లు ఎగబాకి తిరిగి 36 వేల మార్క్​ను అందుకుంది. సెషన్​ ముగిసే సరికి 36.063.81 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 10,863.50 వద్ద సెషన్​ ముగించింది.

ఇదీ కారణం

భారత్​-పాక్​ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయనే నమ్మకం మదుపరుల సెంటిమెంట్​ను ప్రభావితం చేసింది. దీనికి తోడు మార్చి సిరీస్​ డెరివేటివ్స్​పై మదుపరుల కొనుగోళ్ల మద్దతు కూడా స్టాక్ మార్కెట్లు లాభాలకు ఒక కారణం.

ఇంట్రాడే సాగిందిలా

సెషన్​ ప్రారంభం నుంచే 36 వేల మార్క్​ దాటి జోరుమీదున్న సెన్సెక్స్​ ఇంట్రాడేలో 36,140.67 పాయింట్ల గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. ఓ దశలో తిరిగి 35,952.41 పాయింట్ల వద్ద కనిష్ఠ స్థాయిని నమోదుచేసింది.
నిఫ్టీ ఇంట్రాడేలో 10,877.90 పాయింట్ల అత్యధిక స్థాయిని చేరుకోగా అత్యల్పంగా 10,823.10 పాయింట్ల స్థాయిని తాకింది.

లాభానష్టాల్లోనివివే...

సెన్సెక్స్​లో ఇండస్​ఇండ్​ బ్యాంకు, యస్​ బ్యాంకు, వేదాంత, హీరో మోటోకార్ప్​, కోల్​ ఇండియా షేర్లు లాభాలను ఆర్జించాయి. భారతీ ఎయిర్​టెల్​, ఏషియన్​ పెయింట్స్​,బజాజ్​ ఆటో, యాక్సిస్​ బ్యాంకు, రిలయన్స్​ సంస్థల షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

ABOUT THE AUTHOR

...view details