తెలంగాణ

telangana

ETV Bharat / business

వచ్చే నెల నుంచి హెచ్‌-1బీ వీసా మార్పులివి.! - H1-B Visa process 2020

అమెరికా ప్రభుత్వం చేపట్టిన హెచ్​-1బీ వీసా మార్పులు వచ్చే నెల నుంచి అమలుకానున్నాయి. సంబంధిత అప్లికేషన్లను కూడా రానున్న నెలలోనే స్వీకరించనున్నారు. ఈ కొత్త విధానం.. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ పద్ధతికి భిన్నంగా ఉంటుంది. మరి ఈ వీసా నిబంధనలేంటి? ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోండి.

US H-1B Visa Electronic Registration Process Begins from Next month
హెచ్‌-1బీ వీసా మార్పులు

By

Published : Mar 9, 2020, 7:11 AM IST

అమెరికా ప్రభుత్వం హెచ్‌-1బీ వీసాల్లో చేసిన మార్పులు వచ్చేనెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ వీసాలకు సంబంధించి ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ను మొదలుపెట్టనుంది. అప్లికేషన్లను కూడా వచ్చేనెల నుంచి స్వీకరించనున్నారు. తొలుత కంపెనీలు ఎలక్ట్రానిక్‌ (ఆన్‌లైన్‌) విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వీసా ఫీజు కింద ప్రతి అప్లికేషన్‌కు 10 డాలర్లను చెల్లించాలి. కొత్త విధానం ప్రస్తుతమున్న లాటరీ విధానంలో చాలా మార్పులు తీసుకురానుంది. అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ ఏటా 85 వేల హెచ్‌-1బీ వీసాలను జారీ చేస్తోంది. వీటిల్లో అత్యధికంగా భారతీయులు పొందుతుండగా.. అందులో 70 శాతం ఐటీ ఉద్యోగులకే లభిస్తున్నాయి.

సరికొత్త నిబంధనలు ఇవి...

  • హెచ్‌-1బీ వీసా ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ మార్చి1న మొదలై.. మార్చి 20 వరకు కొనసాగుతుంది. కంపెనీలు ప్రతి అభ్యర్థి కోసం 10 డాలర్లు చెల్లించాలి. కొత్త విధానంలో సమాచార సేకరణ, పేపర్‌ వర్క్‌ను కుదించడం సహా.. యాజమాన్యాలకు మొత్తం మీద అయ్యే వ్యయాలను కూడా తగ్గిస్తుంది.
  • ఈ రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌లో ఉద్యోగి, యజమానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే అడుగుతారు. లబ్ధిదారు పూర్తిపేరు, పుట్టిన తేదీ వివరాలు, దేశం, పౌరసత్వం, లింగ సమాచారం, పాస్‌పోర్టు నంబర్‌ వంటి వాటితో పాటు జాబ్‌ ఆఫర్‌ లెటర్‌ను కూడా వారికి సమర్పించాల్సి ఉంటుంది.
  • హెచ్‌-1బీ వీసాలు రిజిస్ట్రేషన్‌ సమయంలో యాదృచ్చికంగా స్క్రీనింగ్‌ చేస్తారు. ఆ తర్వాత ఎంపికైన వారికి యూఎస్‌సీఐఎస్‌ విషయం వెల్లడించి 90 రోజుల్లోపు హెచ్‌-1బీ వీసాకు పిటిషన్‌ పెట్టుకోవాలని సూచిస్తారు. ఈ పిటిషన్లను ఏప్రిల్‌ 1 నుంచి దాఖలు చేయవచ్చు. దీంతో ఎంపిక అయిన వారు మాత్రమే పిటిషన్‌ దాఖలు చేస్తున్నందున ఖర్చు, శ్రమ మిగులుతున్నాయని యూఎస్‌సీఐఎస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మార్క్‌ కౌమన్స్‌ పేర్కన్నారు.
  • ప్రస్తుతం 65 వేల హెచ్‌-1బీ వీసాలు మాత్రమే జారీ చేస్తున్నారు. దీనికి అదనంగా అమెరికాలో ఉన్నత విద్య (మాస్టర్స్‌ డిగ్రీ, అంతకంటే ఎక్కువ స్థాయి విద్య) పూర్తి చేసిన మరో 20 వేల మంది విదేశీ వృత్తి నిపుణలకు వీటిని ఇస్తున్నారు. హెచ్‌-1బీ వీసాలు అత్యధికంగా పొందే తొలి 30 కంపెనీల్లో అత్యధికంగా ఐటీ రంగానికి చెందినవే ఉన్నాయి. 2018లో 66 శాతం ఈ వీసాలు కంప్యూటర్‌కు సంబధించిన ఉద్యోగాలు చేసేవారికే లభించాయి. ఈ విషయాన్ని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగ రికార్డులు తెలియజేస్తున్నాయి.

ఇదీ చదవండి:హెచ్‌-1బీ వీసాలకు ఇక ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్‌

ABOUT THE AUTHOR

...view details