కరోనా వల్ల దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా పీడిస్తోంది. ఈ సమస్య పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉన్నట్లు ఓ సర్వేలో తెలిసింది.
దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు నాలుగు వారాలుగా తగ్గుముఖం పట్టగా.. జులై 5తో ముగిసిన వారంలో మళ్లీ 11.26 పెరిగినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదికలో పేర్కొంది. అంతకు ముందు వారం నిరుద్యోగిత రేటు 10.69 శాతంగా ఉంది.
నిరుద్యోగిత పెరిగేందుకు కారణాలు..
దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్తో కొన్ని నెలలుగా నిరుద్యోగిత భారీగా పెరుగుతోంది. ఇటీవల లాక్డౌన్ సడలింపులతో కాస్త తక్కుముఖం పట్టింది. అయితే మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల కర్ణాటక, తమిళనాడు, అసోం, బంగాల్, మహారాష్ట్రల్లో విధించిన తాజా ఆంక్షలతో ఉపాధి అవకాశాలు తగ్గినట్లు సర్వే విశ్లేషించింది.