తెలంగాణ

telangana

ETV Bharat / business

పామాయిల్​ రైతులకు గుడ్​న్యూస్- భారీగా పెట్టుబడి సాయం - పామాయిల్ పంటకు భారీ ప్రోత్సాహం

దేశీయంగా పామాయిల్​ పంటను ప్రోత్సహించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తీసుకొచ్చిన నేషనల్​ మిషన్​ ఆన్​ ఎడిబుల్​ ఆయిల్స్​- ఆయిల్​ పామ్ పథకానికి భారీగా నిధులు కేటాయించింది. వంట నూనె అవసరాలకు విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశమని కేంద్రం పేర్కొంది.

Oil Palm Firming
ఆయిల్​ పామ్ పంట

By

Published : Aug 18, 2021, 4:31 PM IST

Updated : Aug 18, 2021, 6:39 PM IST

వంట నూనె అవసరాలకు విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర కేబినెట్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తీసుకొచ్చిన నేషనల్​ మిషన్​ ఆన్​ ఎడిబుల్​ ఆయిల్స్​- ఆయిల్​ పామ్​ (ఎన్​ఎంఈఓ-ఓపీ) పథకానికి.. రూ.11,040 నిధులను కేటాయించే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది.

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించారు.

వచ్చే ఐదేళ్లకు గానూ దేశీయంగా పామాయిల్ సాగును ప్రోత్సహించడం, వంట నూనె అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కోసం ఈ నిధులను వినియోగించనుంది కేంద్రం. ఇందులో భాగంగా ఆయిల్​ పామ్​ సాగు కోసం హెక్టార్​కు రూ.29 వేలు(ప్రస్తుతం ఇది రూ.12వేలుగా ఉంది) పెట్టుబడి సాయం అందించాలని కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. ఈశాన్య భారతంలో 15 హెక్టార్లలో సాగుకు రూ.కోటి వరకు సాయం అందించాలని తీర్మానించింది.

పథకం లక్ష్యాలు..

ఈ మిషన్​ ద్వారా 2025-26 నాటికి 6.5 లక్షల హెక్టార్లలో పామాయిల్​ పంటను పండించేలా రైతులను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. ఫలితంగా వార్షిక ప్రాతిపదికన 2025-26 నాటికి 11.20 లక్షల టన్నుల ముడి పామాయిల్​ ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఇది 2029-30 నాటికి 28 లక్షల టన్నులకు పెరుగుతుందని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితి..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.70 లక్షల హెక్టార్లలో మాత్రమే పామాయిల్ సాగు అవుతున్నట్లు వెల్లడించారు తోమర్​. ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ సాగుకు అవకాశాలు మెండుగా ఉన్నా.. శుద్ధి పరిశ్రమలు లేకపోవడం వల్ల అది సాధ్యపడటం లేదని వివరించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఎన్​ఎంఈఓ-ఓపీ పథకం ద్వారా ఆయా ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర- ఎంతంటే?

Last Updated : Aug 18, 2021, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details