Union Budget price rise: కేంద్రం బడ్జెట్-2022ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్. సాధారణంగా ఉపయోగించే కొన్ని వస్తువులపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే కొన్నింటిపై దిగుమతి సుంకంలో కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొన్ని వస్తువులు చౌకగా రానుండగా, మరికొన్ని మాత్రం ప్రియం కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కస్టమ్స్ సుంకం పెంచడం వల్ల ధరలు పెరిగే వస్తువులు
- గొడుగులు
- అనుకరణ ఆభరణాలు
- లౌడ్ స్పీకర్లు
- హెడ్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్
- స్మార్ట్ మీటర్స్
- సోలార్ సెల్స్
- సోలార్ మాడ్యూల్స్
- ఎక్స్‌రే మెషీన్లు
- ఎలక్ట్రిక్ బొమ్మల విడిభాగాలు
కస్టమ్స్ సుంకం తగ్గించడం వల్ల చౌకగా లభించే వస్తువులు..
- పాలిష్ చేసిన వజ్రాలు
- మొబైల్ ఫోన్ల కెమెరా లెన్స్
- ఇంగువ
- కొకోవా బీన్స్
- ఎసిటిక్ ఆమ్లాలు
- మిథైల్ ఆల్కహాల్
- ఫ్రోజెన్ మస్సెల్స్
- ఫ్రోజెన్ స్క్విడ్స్