Twitter Trends in 2021 in India: దేశంలో కరోనా రెండో దశ విధ్వంసం సృష్టించింది. ఈ సమయంలోనే భారత్ సహా ప్రపంచమంతా మనకు అండగా నిలిచింది. అప్పుడే ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్.. యూనిసెఫ్ ఆస్ట్రేలియా ద్వారా 50 వేల డాలర్లు(రూ. 37 లక్షలకుపైగా) భారత్‌కు విరాళం ప్రకటించి చేయూతనందించాడు. ఆ తర్వాత.. చాలా మంది అదే బాటలో నడిచారు.
Pat Cummins Tweet: కమిన్స్ డొనేషన్ ప్రకటిస్తూ చేసిన ఆ ట్వీట్ భారత్‌లో.. ట్విట్టర్లో ఈ ఏడాది అత్యధిక రీట్వీట్లు పొందిన పోస్ట్‌గా నిలిచింది. లక్షా 14 వేల మంది కమిన్స్ పోస్ట్‌ను రీట్వీట్ చేయడం విశేషం.
- తనకు కూతురు జన్మించినట్లు టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ అత్యధిక మందికి నచ్చింది. 'మోస్ట్ లైక్డ్ ట్వీట్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచింది. దీనిని 5 లక్షల 38 వేలకుపైగా లైక్స్ వచ్చాయి.
- వరుసగా రెండో ఏడాది కోహ్లీ ట్వీటే అత్యధిక లైక్స్ పొందింది. గతేడాది విరాట్ తన సతీమణి అనుష్క శర్మ గర్భం దాల్చినట్లు చేసిన ట్వీట్ 2020లో అత్యధిక లైక్స్ పొందిన ట్వీట్‌గా నిలవడం విశేషం.
- Golden Tweets of 2021: ట్విట్టర్ గోల్డెన్ ట్వీట్స్ ఆఫ్ 2021 ప్రకారం.. Covid19, Farmersprotest, Team India, Tokyo2020, IPL2021, #Master, # Bitcoin హ్యాష్‌ట్యాగ్‌లను ఎక్కువగా ఉపయోగించారు.
2021 జనవరి 1- నవంబర్ 15 మధ్యలో అత్యధిక రీట్వీట్లు, లైక్స్ పొందిన ట్విట్టర్ ఖాతాలను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదిక రూపొందించింది ట్విట్టర్.
Twitter Modi News: ప్రభుత్వ ఖాతాలకు సంబంధించి అత్యధిక రీట్వీట్లు, అత్యధిక లైక్స్ ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్‌లకు రావడం విశేషం.
- కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నట్లు మోదీ చేసిన ట్వీట్ టాప్ రీట్వీట్గా (225,800) నిలిచింది.
- ఆస్ట్రేలియాపై గబ్బాలో చారిత్రక టెస్టు విజయం సాధించిన టీమ్ ఇండియాను అభినందిస్తూ ప్రధాని చేసిన ట్వీట్ అత్యధిక లైక్స్(2,98,000) పొందింది.
Ratan Tata Tweet: బిజినెస్‌కు సంబంధించి.. 70 ఏళ్ల తర్వాత ఎయిర్ ఇండియాను దక్కించుకున్నట్లు టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా చేసిన ట్వీట్ అత్యధిక ట్వీట్లు, అత్యధిక లైక్స్ దక్కించుకుంది.