తెలంగాణ

telangana

By

Published : May 14, 2021, 6:15 PM IST

ETV Bharat / business

ట్విట్టర్​లో 'బ్లూ టిక్'​ కావాలా? ఇలా చేయండి...

ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్‌ తన ఖాతాల ధ్రువీకరణ (బ్లూటిక్​) కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుంది. తమ ఖాతాకు బ్లూ టిక్ కావాలనుకునే వినియోగదారులు అకౌంట్ సెట్టింగ్​లోని ఫారంలో వివరాలు నింపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరిలోనే ఈ ఫీచర్​​ను ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ.. వివిధ కారణాల వల్ల ఆలస్యమైనట్లు టెక్ వర్గాలు తెలిపాయి.

Twitter
ట్విట్టర్

మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫామ్​ ట్విట్టర్​ మరోసారి ఖాతాల ధ్రువీకరణ (బ్లూటిక్​) కార్యక్రమం ప్రారంభించనునట్లు తెలుస్తోంది. నిజానికి ఈ ప్రక్రియ జనవరిలోనే ప్రారంభించాలని ట్విట్టర్ భావించింది. అయితే వేర్వేరు కారణాల వల్ల ఆలస్యమైంది. టెక్ వర్గాల ప్రకారం వచ్చే వారం నుంచి ట్విట్టర్​ యూజర్లకు స్వీయ ధ్రువీకరణ ఫారం అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ టెక్ బ్లాగర్ జెనీ మాన్​చుమ్​ వాంగ్​ ఈ ఫారం ఎలా ఉండనుందో కొన్ని ఫొటోలను తన హ్యాండిల్​లో షేర్ చేశారు. ఈ ఫారం అకౌంట్ సెట్టింగ్ పేజీలో అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. వెబ్, మొబైల్ యాప్​ రెండింటి ద్వారా దీనిని యాక్సెస్ చేయొచ్చని పేర్కొన్నారు. అందులో అడిగిన వివరాలు సమర్పించడం ద్వారా యూజర్ల ఖాతాను ధ్రువీకరించి.. బ్లూ టిక్ ఇవ్వనున్నట్లు వివరించారు.

మీకూ బ్లూ టిక్ కావాలంటే..
టెక్ వర్గాల ప్రకారం.. తమ ఖాతాకు బ్లూ టిక్ కావాలనుకునే ట్విట్టర్ యూజర్లు వచ్చే వారం నుంచి అకౌంట్ సెట్టింగ్​లోని ఫారంలో వివరాలు నింపి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిసింది. అయితే ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు, గేమింగ్​​, సామాజిక కార్యకర్తలు, వార్తా సంస్థలు, ఇతర సంస్థలు, జర్నలిస్ట్​లు, ఎంటర్​టైన్​మెంట్​, స్పోర్ట్స్​ విభాగంలోని వ్యక్తులు, ప్రభావశీలురైన వారి వ్యక్తిగత ఖాతాలకు మాత్రమే బ్లూ టిక్​ ఇవ్వనుంది ట్విట్టర్.

ట్విట్టర్ కొత్త వెరిఫికేషన్ విధానం ఇలా..

ధృవీకరణ ప్రక్రియ పూర్తయ్యేందుకు వృత్తి సంబంధిత వివరాలు, వ్యక్తిగత వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

ఇవీ చదంవడి:'ప్రైవసీ పాలసీ'పై వెనక్కి తగ్గిన వాట్సాప్!

ట్విట్టర్​లో కొత్తగా 'టిప్​ జార్​' ఫీచర్​

'మైనారిటీల గొంతు నొక్కే పొరపాట్లు చేయొద్దు'

ABOUT THE AUTHOR

...view details