తెలంగాణ

telangana

ETV Bharat / business

ఖాతాల తొలగింపునకు తలొగ్గిన ట్విట్టర్​ - twitter blocks 97 percent of accounts

ప్రభుత్వం పేర్కొన్న ఖాతాలను తొలగించేందుకు ఎట్టకేలకు ట్విట్టర్​ అంగీకారం తెలిపింది. ఈ విషయంపై బుధవారం.. కేంద్రంతో ట్విట్టర్ ప్రతినిధులు చర్చలు జరిపారు. స్థానిక చట్టాలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించినట్టు సమాచారం.

Twitter blocks 97 pc of accounts, posts flagged by IT Ministry
ఖాతాల తొలగింపునకు తలొగ్గిన ట్విట్టర్​

By

Published : Feb 12, 2021, 6:10 PM IST

రైతు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న ఖాతాలను కట్టడి చేయాలన్న కేంద్రం ఆదేశాలను ట్విట్టర్ పాటించినట్లు తెలుస్తోంది. వాటిలో 97 శాతం ఖాతాలు, పోస్టులను బ్లాక్‌ చేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం.

రైతుల ఉద్యమానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం, ట్విట్టర్‌కు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో బుధవారం రోజున కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ట్విట్టర్ ప్రతినిధుల మధ్య సమావేశం జరిగింది. స్థానిక చట్టాలను పాటించాలని లేకపోతే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని సంస్థ ప్రతినిధులకు కేంద్రం గట్టి హెచ్చరికలు పంపింది. అంతేకాకుండా భారత చట్టాలను పాటించాల్సిందేనని గురువారం ఐటీ శాఖ మంత్రి పార్లమెంట్‌ వేదికగా స్పష్టం చేశారు. తాజాగా ట్విట్టర్.. కేంద్రం ఆదేశాలను పాటించిందని, 97 శాతం ఖాతాలను, పోస్టులను బ్లాక్‌ చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ వార్తలపై ట్విట్టర్ స్పందించలేదు.

రైతుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేలా ట్వీట్లు చేసిన 1,178 ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కొద్ది రోజులు క్రితం కేంద్రం ఆదేశాలు జారీచేసింది. భావ ప్రకటన స్వేచ్ఛకు తాము ప్రాధాన్యం ఇస్తామంటూ ట్విట్టర్ వాటిలో కొన్నింటిపైనే చర్య తీసుకుంది. ఆ వ్యవహారంలో కేంద్రం తీవ్ర ఆగ్రహానికి గురైంది.

ఇదీ చదవండి :కేంద్రం, ట్విట్టర్​కు సుప్రీంకోర్టు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details