తెలంగాణ

telangana

ETV Bharat / business

నేను రెండోసారి గెలిస్తే.. చైనాకు కష్టమే: ట్రంప్​ - చైనా

వాణిజ్య చర్చల్లో చైనా జాప్యం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ మండిపడ్డారు. తాను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే డ్రాగన్​ దేశానికి గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరించారు​.

నేను రెండోసారి గెలిస్తే.. చైనాకు కష్టమే: ట్రంప్​

By

Published : Sep 4, 2019, 8:46 AM IST

Updated : Sep 29, 2019, 9:26 AM IST

ముదిరిన వాణిజ్య యుద్ధం

వాణిజ్య యుద్ధ తీవ్రతను పెంచుతూ మరోసారి చైనాను హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. వాణిజ్య చర్చల్లో డ్రాగన్​ దేశం జాప్యం చేస్తోందని ఆరోపించారు ట్రంప్​. తాను మరోసారి అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఎన్నికైతే.. చైనా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

గతేడాది నుంచి సాగుతున్న వాణిజ్య యుద్ధంలో అమెరికా-చైనాలు పోటాపోటీగా సుంకాలు పెంచుకుంటున్నాయి.

చైనాతో ఉన్న వాణిజ్య లోటును అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్​ తెలిపారు. అగ్రరాజ్యానికి చెందిన అపార జ్ఞానసంపదను డ్రాగన్​ దేశం దోచుకోవడం ఆపాలని ట్రంప్​ స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది జరిగే అమెరికా ఎన్నికల్లో మరో అధ్యక్ష అభ్యర్థి గెలుపొందాలని చైనా కోరుకుంటున్నట్టు ట్రంప్​ తెలిపారు.

"చైనాతో జరుగుతున్న చర్చల్లో మేం ఎంతో మంచి స్థితిలో ఉన్నాం. వచ్చే ఏడాది కొత్త ప్రభుత్వంతో చర్చలు జరపాలని చైనా కోరుకుంటోంది. కానీ నేను గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒప్పందం మరింత కఠినంగా ఉంటుంది. అప్పటికే చైనా ఎగుమతులు క్షీణిస్తాయి. వ్యాపారం, ఉద్యోగాలు పోతాయి."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి డ్రాగన్​ దేశం ప్రయత్నిస్తోందని ట్రంప్​ ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ప్రచారాలు నిర్వహిస్తోందని మండిపడ్డారు.

ఇదీ చూడండి:-పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బ్రెయిన్​డెడ్​ మహిళ!

Last Updated : Sep 29, 2019, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details