తెలంగాణ

telangana

ETV Bharat / business

స్పీడ్ టెస్ట్ కోసం ఈ వెబ్​సైట్లు ట్రై చేశారా? - ఓక్లా స్పీడ్ టెస్ట్

ఇంటర్నెట్ కనెక్షన్ వేగాన్ని తెలుసుకునేందుకు చాలామంది ఆధారపడేది ఆన్​లైన్ వెబ్​సైట్లపైనే. ఆయా సైట్ల పనితీరు ఉత్తమంగా ఉంటేనే డేటా వినియోగంలో ఉన్న ఇబ్బందులను అధిగమించగలుగుతాం. మరి ఆ వేగాన్ని తెలుసుకునేందుకు అందుబాటులో ఉన్న ఐదు ఉత్తమ స్పీడ్ టెస్ట్ వెబ్​సైట్ల గురించి మీరు చూసేయండి..

Speed Test
స్పీడ్ టెస్ట్

By

Published : Jul 20, 2021, 6:37 PM IST

కొత్త ఇంటర్నెట్​ కనెక్షన్ తీసుకున్నా.. ప్రస్తుతం ఉన్న నెట్​ కనెక్షన్​ స్పీడ్​ ఎలా ఉందనేది తెలుసుకోవాలనుకున్నా 'స్పీడ్ టెస్ట్​లు' తప్పనిసరి. అందుకుగాను ఉత్తమ వెబ్‌సైట్‌లు ఏమున్నాయో చూద్దాం.

1. ఓక్లా స్పీడ్ టెస్ట్

ఇంటర్నెట్ వేగం తెలుసుకునేందుకు ఉపయోగించే అత్యంత ప్రసిద్ధి చెందిన వెబ్‌సైట్లలో 'ఓక్లా స్పీడ్ టెస్ట్' ఒకటి. పింగ్, డౌన్‌లోడ్ వేగం, అప్‌లోడ్ వేగం వంటిని కచ్చితంగా అందిస్తుంది. సమగ్ర విశ్లేషణ కోసం భిన్న సర్వర్‌లను ఎంచుకోవచ్చు. అంతేగాక ఇంటర్నెట్ వేగానికి సంబంధించిన హిస్టరీని సైతం ట్రాక్ చేయవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మ్యాక్, క్రోమ్, యాపిల్‌ టీవీ సహా పలు ప్లాట్‌ఫామ్‌లలో ఓక్లా స్పీడ్ టెస్ట్ అందుబాటులో ఉంది.

2. ఫాస్ట్.కామ్

నెట్‌ఫ్లిక్స్ సంస్థకు చెందిన 'ఫాస్ట్.కామ్' వీడియో స్ట్రీమింగ్ ఇంటర్​నెట్ వినియోగదారులకు కీలక సమాచారాన్ని అందిస్తుంది. హోమ్ పేజీలోనే డౌన్‌లోడ్ వేగాన్ని చూపిస్తుంది. 'ఫాస్ట్.కామ్' సైట్.. ఓక్లా స్పీడ్ టెస్ట్ కంటే ఉత్తమంగా ఉంటుందని చెబుతారు.

3. గూగుల్ స్పీడ్ టెస్ట్

గూగుల్ మెజర్మెంట్ ల్యాబ్(ఎం-ల్యాబ్)తో కలసి పనిచేసే ఈ సైట్.. డౌన్‌లోడ్ వేగం, అప్‌లోడ్ వేగంలో జాప్యం వంటి రిజల్ట్స్​ని అందిస్తుంది.

4. 'స్పీడ్ ఆఫ్​ మీ' స్పీడ్ టెస్ట్

ఇంటర్నెట్ వేగాన్ని తెలుసుకునేందుకు 'స్పీ డ్ఆఫ్​ మీ' సైతం బాగా ఉపయోగపడుతుంది. ఇంటర్​నెట్​ వేగంలో హెచ్చుతగ్గులను సులువుగా అర్థమయ్యే రీతిలో చూపిస్తుంది. గరిష్ఠ వేగంతో పాటు డౌన్‌లోడ్ వేగం, అప్‌లోడ్ వేగాలను అందిస్తుంది. స్పీడ్ టెస్ట్ హిస్టరీని సీఎస్​వీ ఫైల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

5. టెస్ట్​మై.నెట్

టెస్ట్​మై.నెట్ డౌన్‌లోడ్ వేగం, అప్‌లోడ్ వేగం, ఇంటర్నెట్​ స్పీడ్​లను విడివిడిగా అందిస్తుంది. నగరం, దేశం ప్రపంచంలో సగటు ఇంటర్నెట్ వేగాన్ని చూపడం దీని ప్రత్యేకత. ఇతర ఆపరేటర్​లతో పోలుస్తూ మీ ఇంటర్నెట్ వేగం ఎంత నెమ్మదిగా లేదా వేగంగా ఉందో చూపిస్తుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details