ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే వారికి కచ్చితంగా డీమ్యాట్ ఖాతా ఉండాలి. స్టాక్ బ్రోకరేజీ సంస్థలు వీటిని అందిస్తుంటాయి. ప్రస్తుతం దేశంలో చాలా సంస్థలు ఈ సేవలు ఇస్తున్నాయి. అందులో ఎక్కువ మంది వినియోగించేవి.. కొత్తగా ట్రేడింగ్ చేయాలనుకునే వారికి ఉత్తమమైన బ్రోకరేజీ సేవలందించే సంస్థలు, వాటి ఛార్జీల గురించి తెలుసుకుందాం.
జెరోధా
- దేశీయంగా అతిపెద్ద రిటైల్ స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లో జెరోధా అగ్ర స్థానంలో ఉంది.
- ఆధార్, పాన్ కార్డు ఉంటే జెరోధాలో డీమ్యాట్ ఖాతా తెరవచ్చు. ఆన్లైన్లో ఈ ప్రక్రియ సులభంగా పూర్తి చేసుకోవచ్చు.
- రూ.100తో డీమ్యాట్ ఖాతా ప్రారంభించేందుకు వీలుంది.
- జెరోధాలో బ్రోకరేజి ఛార్జీ లావాదేవీకి రూ.20 చొప్పున వసూలు చేస్తారు.
- డీమ్యాట్ ఖాతా వార్షిక నిర్వహణ ఛార్జీలు (ఏఎంసీ) రూ.300.
- జెరోధా మొబైల్యాప్ ద్వారా షేర్ల కొనుగోలు, విక్రయం జరపొచ్చు.
అప్స్టాక్స్
- ఇటీవలి కాలంలో ఎక్కువ మందికి చేరువైన డీమ్యాట్ బ్రోకరేజీల్లో ఇదీ ఒకటి. గతంలో ఇది ఆర్కేఎస్వీ పేరుతో బ్రోకరేజీ సేవలందించేది.
- పరిమిత కాల ఆఫర్ కింద ప్రస్తుతానికి ఉచితంగా డీమ్యాట్ ఖాతాను ఇస్తోంది అప్స్టాక్స్. ఆన్లైన్లోనే ఖాతా తెరిచే ప్రక్రియ సులభంగా పూర్తి చేసేందుకు వీలు కల్పిస్తోంది.
- విశ్లేషణలతో కూడిన పెట్టుబడి సేవలనూ అందిస్తోంది.
- ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది అప్స్టాక్స్.
- అప్స్టాక్స్తో మ్యూచువల్ ఫండ్లలోనూ పెట్టుబడులు పెట్టొచ్చు.
- వార్షిక నిర్వహణ రుసుము రూ.150గా ఉంది.
- డెలివరీ ట్రేడింగ్ ఉచితంగా, లావాదేవీ ఛార్జీలు రూ.20గా ఉన్నాయి.
- మొబైల్ యాప్ ద్వారా సులభంగా అప్స్టాక్స్లో ట్రేడింగ్ చేసేందుకు వీలుంది.
ఏంజెల్ బ్రోకింగ్