ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. ఇంట్లో వాడే టార్చ్‌లైట్, చేతిలో ఉండే మొబైల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు.. అంతా స్మార్ట్ అయిపోయాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించి ఫిట్నెస్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్‌ల దైనందిన జీవితంలో భాగం అయిపోయాయి. హృదయ స్పందన, ఆక్సిజన్ స్థాయి, నిద్ర నాణ్యత తదితర విషయాలు తెలుసుకోవటం ఒకప్పుడు కష్టంగా ఉండేది. ఇప్పుడు స్మార్ట్ వాచ్‌లతో ఆ పని సులభమైంది. స్మార్ట్ వాచ్ ఎంపిక.. బడ్జెట్ ధరల్లో ఉన్న మంచి వాచ్‌లు వివరాలపై ప్రత్యేక కథనం..
ఓఎస్-ఫోన్ కంపాటిబిలిటీ
స్మార్ట్ వాచ్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవటం ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఓ రకంగా ఇవి మన ఫోన్‌కు ఎక్స్టెన్షన్ లాంటివనే చెప్పాలి. కొన్ని వాచ్‌లు కొన్ని రకాల ఫోన్లతో మాత్రమే పనిచేస్తాయి. ఉదాహరణకు ఆపిల్ వాచ్‌లు ఐఫోన్లతో మాత్రమే పనిచేస్తాయి. అదే సమయంలో గూగుల్ వియర్ ఓఎస్ ప్లాట్ ఫామ్, సామ్సంగ్ టైజెన్లు ఆండ్రాయిడ్, ఐఫోన్లతోనూ పనిచేస్తాయి. గూగుల్ వియర్ ఓఎస్‌తో ఉన్న వాచ్‌లు ఐఫోన్లతో పనిచేసినప్పటికీ పరిమిత ఫీచర్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఫిట్నెస్, ఆరోగ్య సంబంధిత ఫీచర్లు
ఆరోగ్యం, ఫిట్నెస్ సంబంధిత వివరాలను సేకరించటం అనేది స్మార్ట్ వాచ్ చేసే ముఖ్యమైన పని. వీటికి సంబంధించి ఎక్కువ ఫీచర్లు ఉన్న వాచ్‌లు కొనుగోలు చేయటం ఉత్తమం. స్మార్ట్ వాచ్ ఎంపికలో దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. హృదయ స్పందన గమనించే ఫీచర్ తప్పకుండా ఉండాలి. ఇక సైక్లింగ్, హైకింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటివాటిని ట్రాక్ చేసేందుకు జీపీఎస్‌తో పాటు.. నిద్ర నాణ్యతను గమనించే ఫీచర్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. కొన్ని వాచ్‌లు అయితే మహిళల ఆరోగ్యం, ఫిట్ నెస్ సంబంధిత ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్నాయి.
డిస్ ప్లే
ప్రస్తుతం ఎక్కువగా స్మార్ట్ వాచ్‌లు ఎల్సీడీ, ఆమోలెడ్ డిస్ప్లే తో వస్తున్నాయి. కలర్ డిస్ప్లే బ్రైట్ నెస్ ఎక్కువగా ఉండటంతో తక్కువ సేపు బ్యాటరీ వచ్చే అవకాశం ఉంది. అయితే కంపెనీలు రోజు రోజుకు స్మార్ట్ వాచ్‌ల సామర్థ్యం పెంచుతున్నాయి. ఒకసారి ఛార్జింగ్‌తో కొన్ని రోజుల పాటు స్మార్ట్ వాచ్‌ను ఉపయోగించుకునేందుకు వీలవుతుంది. అయితే బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే లో ఒక్క ఛార్జ్‌తో ఎక్కువ సేపు ఉపయోగించుకునే వీలుంది.
యాప్ సెలక్షన్
స్మార్ట్ వాచ్ పరిమాణం పరంగా చిన్నగా ఉన్నప్పటికీ వందల సంఖ్యలో యాప్‌లు దీనితో యాక్సెస్ కాగలవు. స్పోర్ట్స్, ఉబర్, వాట్సాప్ వంటి యాప్‌లు వీటికి కస్టమైజ్ అయి ఉంటున్నాయి. యాపిల్ వాచ్‌కు అయితే చాలా యాప్‌లున్నాయి. తరచూ ఉపయోగించే యాప్‌లను వాచ్ తప్పకుండా సపోర్ట్ చేసేలా చూసుకోవాలి.
బ్యాటరీ
ఫిట్నెస్ బ్యాండ్లతో పోల్చితే స్మార్ట్ వాచ్ బ్యాటరీలు ఎక్కువ సేపు ఆగవు. అందుకే కొనుగోలు చేసేముందు బ్యాటరీ సామర్థ్యం తప్పకుండా తెలుసుకోవాలి. బ్యాటరీ లైఫ్‌ను దృష్టిలో పెట్టుకొని వాచ్‌ను ఎంపిక చేసుకోవాలి. కొన్ని వాచ్‌లు ఒక్క ఛార్జ్‌తో ఎక్కువ సేపు పనిచేస్తాయి.
ధర
తక్కువ బడ్జెట్లో ఏ వాచ్ అత్యధిక ఫీచర్లను అందిస్తుందన్నది కొంత పరిశోధన చేసి తీసుకోవాలి. బడ్జెట్ సెగ్మెంట్లో అయితే రియల్ మీ, మధ్యస్థ ధరల స్థాయిలో ఫాజిల్, ఫిట్ బిట్.. ప్రీమియం విభాగంలో యాపిల్ వాచ్ సిరీస్ 5, శామ్సంగ్ గెలాక్సీ వాచ్‌లు ఉన్నాయి.
ఇదీ చదవండి:రివ్యూ 2020: ఉత్తమ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఇవే
బడ్జెట్ ధరల్లో ఉన్న స్మార్ట్ వాచ్‌లు
హానర్ వాచ్ ఈఎస్..
- బ్లడ్ ఆక్సిజన్ లెవల్ సెన్సార్ , హార్ట్ రేట్ మానిటర్, ఎస్పీఓ 2(ఆక్సిజన్ సాచురేషన్) సెన్సార్
- నిద్ర, ఒత్తిడి(స్ట్రెస్) ట్రాకింగ్
- దీర్ఘచతురస్రాకార డిస్ ప్లే
- వర్కవుట్ సంబంధించి అనేక మోడ్స్, ఆటోమెటిక్‌గా వర్కవుట్స్‌ను గుర్తించే ఫీచర్
- 30 నిమిషాల్లో 70 శాతం ఛార్జింగ్
- ధర: రూ.4999
అమేజ్ ఫిట్ బిప్ యూ ప్రో
- 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్రాస్-3 తో కూడిన కలర్ డిస్ ప్లే
- 5 ఏటీఎమ్ వాటర్ రెసిస్టెంట్
- బ్యాటరీ లైఫ్: 9 రోజులు
- వాటర్ రెసిస్టెంట్: 50 మీటర్లు
- 60కి పైగా స్పోర్ట్స్ మోడ్స్
- అమెజాన్ అలెక్సా వాయిస్ కమాండ్స్
- 24 గంటలూ హృదయ స్పందన మానిటరింగ్ సెన్సార్,
- ఎస్పీఓ2 మానిటర్, నిద్ర నాణ్యత విశ్లేషణ
- మహిళలకు సంబంధించి నెలసరి ట్రాకర్
- ధర రూ.4999
ఇదీ చదవండి:ఎంఐ నుంచి 108 మెగా పిక్సెళ్ల బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
రియల్ మీ వాచ్ ఎస్
- 1.3ఇంచ్, 600 నిట్స్ బ్రైట్ నెస్, 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్-3 వృత్తాకార డిస్ ప్లే,
- క్రికెట్, ఇండోర్ రన్నింగ్, అవుట్ డోర్ సైక్లింగ్, ఫుట్ బాల్, యోగా తదితర 16 స్పోర్ట్స్ మోడ్స్
- రియల్ టైమ్ హృదయ స్పందన మానిటరింగ్ కోసం పీపీజీ సెన్సార్,
- రక్తంలో ఆక్సిజన్ స్థాయిల మానిటరింగ్ కోసం ఎస్పీఓ 2 సెన్సార్,
- నిద్ర మానిటరింగ్ ఫీచర్
- 390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఒక్క ఛార్జ్‌తో 15 రోజుల వరకు బ్యాటరీ
- ధర రూ.4999
ఇదీ చదవండి:కరోనాతో స్మార్ట్ఫోన్ల విక్రయాలు 48 శాతం డౌన్!
నాయిస్ కలర్ ఫిట్ ప్రో 3
- 1.55 ఇంచుల ఎల్సీడీ డిస్ ప్లే
- 14 స్పోర్ట్స్ మోడ్స్
- క్యాలరీలు, ప్రయాణించిన దూరం ట్రాకింగ్, స్లిప్ మానిటర్,
- నెలసరీ సైకిల్ మానిటర్ ఫీచర్
- కాల్స్, సందేశాలు, యాప్, సోషల్ మీడియా నోటిఫికేషన్లకు వైబ్రేషన్ అలర్ట్
- బ్యాటరీ- 210 ఎంఏహెచ్, ఒక్క పూర్తి ఛార్జింగ్‌తో 10 రోజలు వరకు నడిచే అవకాశం
- ధర రూ. 4499
బోట్ స్టార్మ్
- చతురస్రాకారపు 1.3 ఇంచుల డిస్ ప్లే
- మెటల్ కేసింగ్, 5ఏటీఎమ్ వాటర్ రెసిస్టెంట్
- ఎస్పీఓ2 మానిటర్, 24/7 హృదయ స్పందన మానిటరింగ్,
- నిద్ర నాణ్యత, నెలసరి ట్రాకింగ్
- 9 స్పోర్ట్స్ మోడ్స్
- 8 రోజుల వరకు బ్యాటరీ
- ధర రూ.2499
ఇవీ చదవండి:'జీవితాలు, జీవనోపాధి కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు'
'ఆటో' రంగంపై కరోనా సెగ- విక్రయాలు తగ్గేనా?
ఈ-బైక్ కొనాలనుకుంటున్నారా.. ఇవి మీ కోసమే!