తెలంగాణ

telangana

By

Published : Jun 20, 2021, 5:42 AM IST

ETV Bharat / business

మీ ఫోన్​లో ఈ యాప్స్​ ఉన్నాయా? జాగ్రత్త!

ఎనిమిది ప్రమాదకర అప్లికేషన్​లను వెంటనే తొలగించాలని వినియోగదారులకు గూగుల్​ ప్లే స్టోర్​ సూచించింది. అవి ఏంటంటే...

Joker malware
గూగుల్​ ప్లే స్టోర్

గత మూడేళ్లుగా జోకర్‌ మాల్‌వేర్‌ కారణంగా కొన్ని ఆప్లికేషన్లను తొలగిస్తూ వస్తోంది గూగుల్ ప్లే స్టోర్. తాజాగా క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్.. గూగుల్‌ ప్లే స్టోర్‌లోని మరో ఎనిమిది అప్లికేషన్లలో జోకర్ మాల్వేర్‌ను గుర్తించింది. దాంతో ప్లే స్టోర్‌ ఆ ఎనిమిది అప్లికేషన్లనూ తొలగించింది. ఆండ్రాయిడ్ యూజర్స్‌ తమ ఫోన్ల నుంచి ఈ యాప్స్‌ను వెంటనే తొలగించాలని గూగుల్ సూచించింది.

గూగుల్‌ తొలగించిన యాప్స్‌ ఇవే..

  • ఆక్సిలరీ మెసేజ్‌ (Auxiliary Message)
  • ఫాస్ట్‌ మ్యాజిక్‌ ఎస్‌ఎంఎస్‌ (Fast Magic SMS)
  • ఫ్రీ క్యామ్‌ స్కానర్ (Free CamScanner)
  • సూపర్‌ మెసేజ్‌ (Super Message)
  • ఎలిమెంట్‌ స్కానర్‌ (Element Scanner)
  • గో మెసేజెస్‌ (Go Messages)
  • ట్రావల్‌ వాల్‌పేపర్స్‌ (Travel Wallpapers)
  • సూపర్‌ ఎస్‌ఎంఎస్‌ (Super SMS)

ఈ జోకర్‌ మాల్‌వేర్ అనేది యాప్‌ల ద్వారా యూజర్స్‌ ఫోన్లలోకి ప్రవేశిస్తుంది. తర్వాత యూజర్ ప్రమేయం లేకుండా అనవసరమైన పలు రకాల ప్రీమియం సర్వీసులను సబ్‌స్క్రైబ్ చేసుకుంటుంది. ఇందుకోసం చిన్న చిన్న కోడ్‌లను ఉపయోగించి గూగుల్ ప్లే ప్రొటెక్షన్ ఫ్రేమ్‌వర్క్‌కి దొరకకుండా పని పూర్తి చేస్తుంది. అలానే ఈ యాప్‌లలో వినియోగదారులు వారి వివరాలను రిజిస్టర్‌ చేసుకున్నప్పుడు స్పైవేర్‌తో వారి మెసేజ్‌లు, కాంటాక్ట్‌ లిస్ట్‌తో పాటు డివైజ్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరిస్తుంది.

ఇదీ చూడండి:ఆ యాప్స్​లో 'జోకర్​' మాల్​వేర్- దొరికినంత దోచేస్తోంది​!

ABOUT THE AUTHOR

...view details