కొవిడ్ సంక్షోభం వేళ భారత్‌కు ఆపన్నహస్తం అందించింది ప్రపంచ బ్యాంకు. కరోనాతో కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పునరుజ్జీవం కల్పించే దిశగా భారత ప్రభుత్వం చేపట్టే చర్యలకు సహకారం అందించేలా 500 మిలియన్ డాలర్ల కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.
5,55,000 ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రపంచబ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.
"భారత ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈ రంగం చాలా ముఖ్యమైంది. దేశ జీడీపీలో 30శాతం వాటా ఈ రంగానిదే. ఎగుమతుల్లోనూ 40 శాతం ఇక్కడి నుంచే. అయితే కొవిడ్ కారణంగా ఈ రంగం తీవ్రంగా కుదేలైంది. దీంతో ఎంఎస్‌ఎంఈల బలపేతం కోసం భారత్‌కు అండగా నిలిచేందుకు 500 మిలియన్ డాలర్లతో RAMP(రైజింగ్ అండ్ ఆక్సిలరేటింగ్ ఎంఎస్‌ఎంఈ పర్ఫామెన్స్) కార్యక్రమాన్ని చేపడుతున్నాం"