ప్రముఖ విద్యుత్ వాహనాల ఉత్పత్తి సంస్థ టెస్లా షేర్ల విలువ భారీగా పడిపోయింది. న్యూయార్క్ ట్రేడింగ్‌లో టెస్లా సంస్థ షేర్ల విలువ ఏకంగా 21 శాతానికి పైగా తగ్గింది. దీంతో కంపెనీ విలువ సుమారు 82 బిలియన్ డాలర్లు తగ్గి.. 307.7 బిలియన్ డాలర్లను చేరుకుంది. టెస్లాకు ఎస్‌అండ్పీ -500 ఇండెక్స్ జాబితాలో చోటు దక్కకపోవడంతో మదుపరులు సంస్థ షేర్లను భారీగా విక్రయించారు.
సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ సంపద విలువ కూడా రికార్డు స్థాయిలో పడిపోయింది. మస్క్ 16.3 బిలియన్ డాలర్ల మేర నష్టపోయారు. ఒకరోజు వ్యక్తిగత సంపద పతనాల్లో ఇదే అత్యధికమని ఆర్థిక అంచనాల సంస్థ బ్లూమ్‌బర్గ్ ప్రకటించింది. మస్క్ సంపద విలువ ప్రస్తుతం 82.3 బిలియన్ డాలర్లుగా సంస్థ గణించింది. ఫ్రాన్స్ కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను గత నెలలో వెనుకకు నెట్టి ప్రపంచ ధనవంతుల్లో నాలుగో స్థానంలో నిలిచిన మస్క్.. ప్రస్తుతం ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.