నూతన గోప్యతా నిబంధనలను అంగీకరించని యూజర్ల ఖాతాను 'డిలీట్' చేయబోమని వాట్సాప్ ఇది వరకే స్పష్టతనిచ్చింది. అయితే వారికి పరిమిత సేవలే లభ్యమవుతాయని కూడా తెలిపింది. వివిధ వర్గాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో గతంలో వాయిదా వేసిన ఈ నిబంధనలు ఎట్టకేలకు శనివారం (మే 15) నుంచి అమలులోకి వచ్చాయి.
కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన వెంటనే.. వాట్సాప్ ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ మీమ్స్ రూపంలో చేసిన విమర్శలు.. ఇరు సంస్థల మధ్య ట్విట్టర్ వార్‌కు తెరలేపాయి.
మీమ్స్ వార్ ఇలా..
విండోస్‌లో ఉండే 'ట్రాష్' పరిణామ క్రమాన్ని ఉదహరిస్తూ.. 2021లో వాట్సాప్, ఫేస్‌బుక్‌లను బిన్ చేయాల్సిన సమయం వచ్చిందనేలా ఓ మీమ్‌ను ట్విట్టర్లో షేర్ చేసింది టెలిగ్రామ్.