తెలంగాణ

telangana

ETV Bharat / business

విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో లాభాల్లో స్టాక్​మార్కెట్లు - నష్టాలు

విదేశీపెట్టుబడుల ప్రవాహం పెరగడం వల్ల దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. టాటా మోటార్స్, ఆర్​ఐఎల్​, టాటా స్టీల్​ ఆరంభ ట్రేడింగ్​లో పుంజుకున్నాయి.

విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో... లాభాల్లో స్టాక్​మార్కెట్లు

By

Published : Oct 29, 2019, 10:32 AM IST

ఈక్విటీ బెంచ్​మార్క్​ బీఎస్​ఈ-సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్​లో 200 పాయింట్లకు పైగా పెరిగింది. విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగిన నేపథ్యంలో టాటా మోటార్స్, ఆర్​ఐఎల్​, టీసీఎస్​ లాభాలతో కొనసాగుతున్నాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 257 పాయింట్లు లాభపడి 39 వేల 507 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 75 పాయింట్ల వృద్ధితో 11 వేల 702 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో

టాటామోటార్స్ (13 %), ఆర్​ఐఎల్​, టాటా స్టీల్​, ఎం​ అండ్ ఎం​, వేదాంత, టీసీఎస్​, మారుతీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో

భారతీ ఎయిర్​టెల్, ఎస్​ బ్యాంకు, కోటక్​ బ్యాంకు, హెచ్​యూఎల్​, ఎన్​టీపీసీ, ఏషియన్ పెయింట్స్, పవర్​గ్రిడ్​, ఎస్​బీఐ 4 శాతం మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్వల్పకాలిక అస్థిరత?

పెట్టుబడిదారులు ఇకపై కార్పొరేట్ ఆదాయ ప్రకటనలపై దృష్టి సారించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే యూఎస్ ఫెడరల్ రిజర్వ్​ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశముందని భావిస్తున్నారు. బ్రెగ్జిట్​, వాణిజ్య యుద్ధం ప్రభావం వల్ల మార్కెట్లో స్వల్పకాలిక అస్థిరత ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లు

ఆసియా, షాంఘై, హాంకాంగ్, షియోల్​, టోక్యో మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. కాగా వాల్​స్ట్రీట్ ఎక్స్ఛేంజి సోమవారం లాభాలతో ముగిసింది.

రూపాయి విలువ

రూపాయి విలువ ప్రస్తుతం 16 పైసలు పెరిగి ఒక డాలరుకు రూ.70.73గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.70 శాతం పడిపోయింది. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 61.14 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:ప్రీ పెయిడ్​.. పోస్ట్​ పెయిడ్​.. ఏ ప్లాన్​ ఉత్తమం..!

ABOUT THE AUTHOR

...view details