తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకింగ్, వాహన రంగాల ఊతంతో లాభాలు - రూపాయి విలువ

బ్యాంకింగ్, వాహన రంగాలు ఇచ్చిన ఊతంతో మంగళవారం దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 174 పాయింట్లు వృద్ధి చెంది 36 వేల 874 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 56 పాయింట్లు వృద్ధి చెంది 10 వేల 918 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్, వాహన రంగాల ఊతంతో లాభాలు

By

Published : Aug 6, 2019, 10:33 AM IST

దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ మొదట్లో 200 పాయింట్లు పుంజుకోగా, నిఫ్టీ 10,900 స్థాయిని తిరిగి పొందింది. బ్యాంకింగ్, వాహన రంగాల షేర్లు రాణించడమే ఇందుకు కారణం.

బీఎస్​ఈ సెన్సెక్స్ 174 పాయింట్లు వృద్ధి చెంది 36 వేల 874 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 10 వేల 918 వద్ద ట్రేడవుతోంది.
నిన్న కశ్మీర్ పరిణామాలు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, రూపాయి విలువ బలహీన పడటం, కార్పొరేట్​ లాభాల క్షీణత ఫలితంగా స్టాక్​మార్కెట్లు భారీ పతనమయ్యాయి మార్కెట్లు.

వీటి ప్రభావం నేడూ ఉన్నప్పటికీ.... బ్యాంకింగ్, వాహన రంగాల కొనుగోళ్లు ఊపందుకోవడం... దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాల బాట పట్టేందుకు కారణమైంది.

లాభాల్లో

ఇండస్​ఇండ్​ బ్యాంకు, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, ఎస్​ బ్యాంకు, ఎల్​ అండీ టీ, బజాజ్​ ఫైనాన్స్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంకు 2 శాతం లాభాలతో ట్రేడువుతున్నాయి.

నష్టాల్లో

టీసీఎస్​, హెచ్​యూఎల్​, కోటక్ బ్యాంకు, ఇన్ఫోసిస్​, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఆర్​ఐఎల్​ 1.07 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు

సోమవారం అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లూ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి

రూపాయి విలువ 22 పైసలు తగ్గి, ఒక డాలరుకు రూ.70.50గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.99 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 60.40 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: ఆర్బీఐతో పాటే బ్యాంకుల వడ్డీ సవరణ..!

ABOUT THE AUTHOR

...view details