తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ పతనం దిశగా మార్కెట్లు- సెన్సెక్స్ 900 మైనస్​

Stock markets in heavy losses
భారీ నష్టాల్లో స్టాక్​మార్కెట్లు

By

Published : May 18, 2020, 9:40 AM IST

Updated : May 18, 2020, 11:22 AM IST

11:03 May 18

దేశీయ మార్కెట్లు భారీ పతనం దిశగా సాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 942 పాయింట్లు కోల్పోయి 30 వేల 155 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 276 పాయింట్లు కోల్పోయి 8 వేల 860 వద్ద ట్రేడవుతోంది.

10:23 May 18

భారీ నష్టాల్లో స్టాక్​మార్కెట్లు.... సెన్సెక్స్ 698 మైనస్​

దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఉద్దీపన ప్యాకేజీ మదుపరుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో విఫలం కావడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 698 పాయింట్లు కోల్పోయి 30 వేల 398 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయి 8 వేల 936  వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

భారతీ ఇన్​ఫ్రాటెల్, సిప్లా, ఇన్ఫోసిస్​, టీసీఎస్​, బ్రిటానియా, రిలయన్స్ రాణిస్తున్నాయి.

ఐసీఐసీఐ బ్యాంకు 6 శాతం మేర నష్టాలతో కొనసాగుతోంది. యాక్సిస్ బ్యాంకు, ఎస్​బీఐ, బజాజ్​ ఫైనాన్స్, టైటాన్, మారుతి సుజుకి, ఇండస్​ఇండ్, పవర్​గ్రిడ్, ఓఎన్​జీసీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

షాంఘై, హాంగ్​కాంగ్​, టోక్యో, సియోల్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 2.77 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 33.40 డాలర్లుగా ఉంది.

09:47 May 18

భారీ పతనం దిశగా...

దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 677 పాయింట్లు కోల్పోయి 30,420 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 205 పాయింట్లు కోల్పోయి 8 వేల 931 వద్ద ట్రేడవుతోంది.

09:43 May 18

భారీ నష్టాల్లో స్టాక్​మార్కెట్లు.... సెన్సెక్స్ 510 మైనస్​

దేశీయ మార్కెట్లు భారీ నష్టాల వైపు జారుకుంటున్నాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 510 పాయింట్లు కోల్పోయి 30 వేల 587 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 148 పాయింట్లు కోల్పోయి 8 వేల 988 వద్ద ట్రేడవుతోంది.

09:30 May 18

జోష్​ ఇవ్వని ప్యాకేజీ... నష్టాల్లో మార్కెట్లు

దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలకు తోడు, కరోనా ప్యాకేజీ మదుపరుల్లో నమ్మకాన్ని కలిగించలేకపోవడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 245 పాయింట్లు కోల్పోయి 30 వేల 851 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 73 పాయింట్లు కోల్పోయి 9 వేల 63 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

భారతీ ఇన్​ఫ్రాటెల్, సిప్లా, ఇన్ఫోసిస్​, బ్రిటానియా, రిలయన్స్ రాణిస్తున్నాయి.

కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్​బీఐ, యాక్సిస్ బ్యాంకు, బజాజ్​ ఫైనాన్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : May 18, 2020, 11:22 AM IST

ABOUT THE AUTHOR

...view details