ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / business

కశ్మీర్​ ఎఫెక్ట్​: భారీ నష్టాల్లో మార్కెట్లు - GAINS

కశ్మీర్​లో ఉద్రిక్తతలు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, బ్యాంకింగ్, వాహన రంగాల్లో మందగమనాల ప్రభావంతో... స్టాక్​మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షకు ముందు మదుపరులు ఆచితూచి వ్యవహరించడం నష్టాలకు మరో కారణం.

కశ్మీర్​ ఎఫెక్ట్​: భారీ నష్టాల్లో మార్కెట్లు
author img

By

Published : Aug 5, 2019, 9:56 AM IST

కశ్మీర్​ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనల మధ్య... స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, అమెరికా ఫెడ్​ రిజర్వ్​ కీలక వడ్డీరేట్లను తగ్గించడం, ఎఫ్​ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, బలహీనమైన ఆర్థిక గణాంకాలు అన్నీ కలిసి దేశీయ మార్కెట్​పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

సెన్సెక్స్ 36 వేల మార్కు దిగువకు పడిపోయింది. ప్రస్తుతం​ 561 పాయింట్లు కోల్పోయి 36 వేల 556 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 11 వేల మార్కు దిగువనే ఉంది. ప్రస్తుతం 174 పాయింట్లు నష్టపోయి 10 వేల 823 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో

టీసీఎస్​, ఇన్ఫోసిస్, హెచ్​డీఎఫ్​సీ రాణిస్తున్నాయి.

నష్టాల్లో

ఎస్​ బ్యాంకు, వేదాంత, టాటా మోటార్స్, ఎస్​బీఐ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఇదీ చూడండి:'ఆర్బీఐ రెపో రేటు' మరో 25 బేసిస్ పాయింట్ల కోత?

ABOUT THE AUTHOR

...view details