తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు-39,400 దిగువకు సెన్సెక్స్

stock markets today
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : Oct 30, 2020, 9:27 AM IST

Updated : Oct 30, 2020, 12:25 PM IST

12:17 October 30

మిడ్ సెషన్​లో అమ్మకాల ఒత్తిడి..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 350 పాయింట్లకుపైగా కోల్పోయి.. 39,400 దిగువన ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంతో 11,573 వద్ద కొనసాగుతోంది.

టెలికాం, బ్యాంకింగ్ షేర్లలో మిడ్​ సెషన్​లో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

  • నెస్లే, టీసీఎస్, సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, ఐటీసీ, సన్​ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • భారతీ ఎయిర్​టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫినాన్స్​, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:05 October 30

మళ్లీ నష్టాలు..

స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు తగ్గి 39,650 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 15 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,655 వద్ద ట్రేడవుతోంది.

ఆర్థిక షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

  • నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్, సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, ఐటీసీ, ఓఎన్​జీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • బజాజ్ ఫినాన్స్, మారుతీ, భారతీ ఎయిర్​టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:39 October 30

నిఫ్టీ 70 ప్లస్..

స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. సెన్సెక్స్ 190 పాయింట్లకుపైగా పెరిగి 39,946 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 70 పాయింట్లకుపైగా లాభంతో 11,738 వద్ద కొనసాగుతోంది.

హెవీ వెయిట్ షేర్లు చాలా వరకు సానుకూలంగా స్పందిస్తుండటం సహా దాదాపు అన్ని రంగాల్లోని కంపెనీలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. మూడో త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేసినట్లు ప్రకటన వెలువడటం అంతర్జాతీయంగా సానుకూలంగా మారిన అంశం. ఈ పరిణామాలన్నీ లాభాలకు కారణంగా తెలుస్తోంది.

  • ఎన్​టీపీసీ, హెచ్​సీఎల్​టెక్, నెస్లే, టీసీఎస్​, అల్ట్రాటెక్​ సిమెంట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • పవర్​గ్రిడ్, మారుతీ, హెచ్​యూఎల్​, బజాజ్ ఫినాన్స్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

08:53 October 30

వారాంతపు సెషన్​లో ఊగిసలాట

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​లో లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఆరంభంలో నష్టాల దిశగా కదిలిన బీఎస్​ఈ-సెన్సెక్స్ 90 పాయింట్లకుపైగా పెరిగి 39,839 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 10 పాయింట్లకుపైగా స్వల్ప లాభంతో 11,683 వద్ద ట్రేడవుతోంది.

  • నెస్లే, హెచ్​సీఎల్​టెక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎన్​టీపీసీ, ఎల్&టీ, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • పవర్​గ్రిడ్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​యూఎల్​, భారతీ ఎయిర్​టెల్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Oct 30, 2020, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details