తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాలతో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్​ 86+ - సెన్సెక్స్​

stocks live
స్టాక్ మార్కెట్లు లైవ్​

By

Published : Aug 19, 2020, 9:22 AM IST

Updated : Aug 19, 2020, 3:45 PM IST

15:42 August 19

11,400పైకి నిఫ్టీ

అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 86 పాయింట్లు బలపడి 38,615 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 23 పాయింట్లు పుంజుకుని 11,408 వద్దకు చేరింది.

  • టెక్​ మహీంద్రా, భారతీ ఎయిర్​టెల్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ లాభాలను నమోదు చేశాయి.
  • బజాజ్ ఆటో, నెస్లే, ఓఎన్​జీసీ, కోటక్ బ్యాంక్, హెచ్​యూఎల్​, ఇన్ఫోసిస్​ నష్టపోయాయి.

11:44 August 19

జోరు తగ్గిన సూచీలు..

మిడ్​ సెషన్​ ముందు స్ఠాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంతో జోరు కాస్త తగ్గినా.. సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా లాభంతో 38,681 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా వృద్ధితో 11,426 వద్ద కొనసాగుతోంది.

  • ఎస్​బీఐ, ఇండస్​ఇండ్​ బ్యాంక్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్​ ఫిన్​సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • టాటా స్టీల్, హెచ్​సీఎల్​టెక్, నెస్లే, ఇన్ఫోసిస్, టీసీఎస్​ షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.

08:58 August 19

లాభాల పరంపర

స్టాక్ మార్కెట్లలో బుధవారం కూడా లాభాల పరంపర కొనసాగుతోంది. బీఎస్​ఈ-సెన్సెక్స్ దాదాపు 220 పాయింట్లు బలపడి 38,745 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 60 పాయింట్లకుపైగా లాభంతో 11,452 వద్ద కొనసాగుతోంది.

ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ వంటి పెద్ద షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ఉన్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్​&టీ, రిలయన్స్ ఇండ్స్ట్రీస్, ఎం&ఎం, టైటాన్​, ఐటీసీ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి. 

హెచ్​సీఎల్​టెక్​, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, పవర్​గ్రిడ్ షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లయిన షాంఘై సూచీ నష్టాలతో ప్రారంభమైంది. నిక్కీ, కోస్పీ సూచీలు మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నాయి.

Last Updated : Aug 19, 2020, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details