స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. శ్రీమంతులు, విదేశీ సంస్థాత పెట్టుబడిదారులపై సర్‌ఛార్జీ తొలగింపు, వాహన, ఆర్థిక సేవల రంగాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉద్దీపన చర్యలు చేపట్టిన నేపథ్యంలో మార్కెట్లు లాభాలబాట పట్టాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ఆరంభంలో 662 పాయింట్లు ఎగబాకి 37వేల 364 వద్ద గరిష్ఠస్థాయిని తాకింది. తర్వాత కాస్త నెమ్మదించింది. ప్రస్తుతం120 పాయింట్ల వృద్ధితో 36 వేల 821 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 10 వేల 856 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో
ఎస్బీఐ, ఎమ్ అండ్ ఎమ్, బజాజ్ ఫిన్సెర్వ్, హెచ్డీఎఫ్సీ, ఎస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు రాణిస్తున్నాయి.