తెలంగాణ

telangana

ETV Bharat / business

బుల్​ విజృంభణ- రికార్డు గరిష్ఠాలకు సూచీలు - స్టాక్ మార్కెట్ల రికార్డులు

స్టాక్ మార్కెట్లలో మరోసారి బుల్​ విజృంభించింది. సెన్సెక్స్​ 610 పాయింట్ల లాభంతో సరికొత్త రికార్డు స్థాయి అయిన 52,150పైకి చేరింది. నిఫ్టీ 150 పాయింట్లకుపైగా లాభంతో తొలిసారి 15,300 మార్క్​పైన స్థిరపడింది. బ్యాంకింగ్ షేర్లు అధికంగా లాభపడ్డాయి.

Stocks new records
స్టాక్ మార్కెట్ల కొత్త రికార్డులు

By

Published : Feb 15, 2021, 3:40 PM IST

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలు గడించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 610 పాయింట్లు బలపడి చరిత్రలో తొలిసారి 52,154 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 15,315 వద్దకు చేరింది.

'జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గింది. జీఎస్​టీ వసూళ్లు, వాహన విక్రయాలు సానుకూలంగా నమోదయ్యాయి. ఈ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ రికవరీపై భారీ ఆశలు పెంచాయి. ఈ సానుకూలతలతో బ్యాంకింగ్​, వాహన రంగాల్లో భారీగా కొనుగోళ్లు నమోదయ్యాయి. ఫలితలంగా సూచీలు రికార్డు స్థాయిలకు చేరాయి.' అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 52,235 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 51,886 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,340 పాయింట్ల గరిష్ఠ స్థాయి (సరికొత్త రికార్డు స్థాయి), 15,243 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

యాక్సిస్​ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు లాభాలు గడించాయి.

డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్​, హెచ్​యూఎల్​, ఏషియన్​ పెయింట్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో టోక్యో, కోస్పీ సూచీలు లాభాలను నమోదు చేశాయి. షాంఘై, హాంకాంగ్ సూచీలు సెలవులో ఉన్నాయి.

ఇదీ చదవండి:వినియోగదారుల గోప్యతపై వాట్సాప్​, కేంద్రానికి నోటీసులు

ABOUT THE AUTHOR

...view details