తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాల్లో దూసుకెళ్లిన సూచీలు- సెన్సెక్స్​ 793+ - స్టాక్​మార్కెట్

కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన చర్యలతో..... స్టాక్​మార్కెట్లు లాభాల బాటలో దూసుకెళ్లాయి. సెన్సెక్​ 793 పాయింట్లు ఎగబాకి 37వేల 494 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 11 వేల 58 వద్ద ముగిసింది.

'సీతమ్మ మంత్రం'తో మార్కెట్లకు లాభాల పంట

By

Published : Aug 26, 2019, 1:18 PM IST

Updated : Sep 28, 2019, 7:44 AM IST

అంచనాలు నిజం అయ్యాయి. విదేశీ సంస్థాగత మదుపర్లపై అదనపు సర్​ఛార్జ్​ ఎత్తివేత, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలు... మార్కెట్లలో తిరుగులేని ఉత్సాహం నింపాయి. ఫలితంగా... సూచీలు లాభాల బాటలో పరుగులు తీశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్​... నేడు 793 పాయింట్లు వృద్ధిచెంది 37వేల 494 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ... 229 పాయింట్ల లాభంతో 11వేల 58 వద్ద ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా...

ఉదయం 37వేల 363 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్... మొదట్లో కాస్త అమ్మకాల ఒత్తిడికి గురై 36 వేల 493 పాయింట్ల కనిష్ఠస్థాయికి పతనమైంది. తర్వాత పుంజుకుని... ఓ దశలో 37 వేల 544 పాయంట్ల గరిష్ఠస్థాయికి చేరింది. చివరకు 37వేల 494 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ... ఉదయం 11 వేల వద్ద ప్రారంభమైంది. అత్యల్పంగా 10 వేల 757, అత్యధికంగా 11 వేల 70 పాయింట్ల మధ్య కదలాడింది.

లాభాల్లో...

ఆదానీ పోర్ట్స్, ఎస్​ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ, లార్సెన్, బజాజ్​ ఫైనాన్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు రాణించాయి.

నష్టాల్లో...

టాటా స్టీల్​, హీరో మోటోకార్ప్, హిందాల్కో, వేదాంత, కోల్ ఇండియా, సన్​ఫార్మా నష్టపోయాయి.

Last Updated : Sep 28, 2019, 7:44 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details