కరోనా సంక్షోభంతో స్టాక్ మార్కెట్లు మరోమారు భారీ నష్టాలు చవిచూశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ-సెన్సెక్స్ 581 పాయింట్లు పతనమై 28 వేల 288 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ-నిఫ్టీ 205 పాయింట్లు క్షీణించి 8 వేల 263 వద్ద ముగిసింది.
మార్కెట్లపై కరోనా పంజా- సెన్సెక్స్ 581 పాయింట్లు పతనం - స్టాక్ మార్కెట్లు లైవ్
15:39 March 19
14:47 March 19
మళ్లీ నష్టాల్లోకి...
సెషన్ ముగింపునకు ముందు స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెస్సెక్స్ 33 పాయింట్ల నష్టంతో 28,836 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 8,427 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
14:00 March 19
స్వల్ప లాభాలు..
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకుంటున్నాయి. హెవీ వెయిట్ షేర్ల దన్నుతో స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి సూచీలు.
సెన్సెక్స్ 23 పాయింట్లకు పైగా లాభంతో 28,892 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 2 పాయింట్లకు పైగా పుంజుకుని 8,471 వద్ద ఫ్లాట్‌గా ట్రేడింగ్ సాగిస్తోంది.
బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఐటీసీ, భారతీఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
మారుతీ, ఎం&ఎం, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
12:58 March 19
తేరుకోని సూచీలు..
మిడ్ సెషన్ తర్వాత కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 548 పాయింట్లకుపైగా కోల్పోయి 28,321 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ 187 పాయింట్లకుపైగా పతనమై 8,281 వద్ద ట్రేడవుతోంది.
రిలయన్స్ షేర్లు కుదేలు..
దేశీయ అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నేడు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్ఈలో ఈ సంస్థ షేరు దాదాపు 5 శాతం నష్టంతో ట్రేడింగ్ సాగిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ షేరు విలువ రూ.921 వద్ద ఊగిసలాడుతోంది. వరుస నష్టాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.5,80,835 కోట్లకు పడిపోయింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
30 షేర్ల ఇండెక్స్‌లో ఐటీసీ, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్‌లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
మారుతీ, ఎం&ఎం, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, హెచ్‌యూఎల్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
11:57 March 19
మిడ్ సెషన్ ముందు మళ్లీ భయాలు...
మిడ్ సెషన్ ముందు స్టాక్ మార్కెట్లు మళ్లీ భారీ నష్టాలవైపు కదులుతున్నాయి. సెన్సెక్స్ 952 పాయింట్లకు పైగా నష్టంతో..28,917 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 275 పాయింట్లు కోల్పోయి 8,193 వద్ద కొనసాగుతోంది.
హెవీ వెయింట్ షేర్ల సానుకూలతలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు కారణమవుతోంది.
పవర్‌గ్రిడ్, భారతీఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో 27 కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
11:20 March 19
కుదుట పడుతున్న సూచీలు..
స్టాక్ మార్కెట్లు కుదుటపడుతున్నాయి. సెన్సెక్స్ నష్టాలు 477 పాయింట్లకు తగ్గాయి. ప్రస్తుతం ఈ సూచీ 28,382 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ 119 పాయింట్ల నష్టంతో 8,349 వద్ద ట్రేడవుతోంది. హెవీ వెయిట్ షేర్లు సానుకూలంగా స్పందిస్తుండటం మార్కెట్లకు కలిసొస్తోంది.
30 షేర్ల ఇండెక్స్‌లో ఐటీసీ, లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
ఎం&ఎం, మారుతీ షేర్లు అత్యధిక నష్టాల్లో కొనసాగుతున్నాయి.
11:07 March 19
కాస్త వెనక్కి..
భారీ నష్టాల నుంచి కాస్త వెనక్కి తగ్గాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ ప్రస్తుతం 1,011 పాయింట్ల నష్టంతో 27,858 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 382 పాయింట్ల క్షీణతతో 8,086 వద్ద కొనసాగుతోంది.
10:46 March 19
కొనసాగుతున్న పతనం..
స్టాక్ మార్కెట్లు నష్టాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 1,679 పాయింట్ల నష్టంతో 27,190 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ 495 పాయింట్లు కోల్పోయి 7,973 వద్ద ట్రేడవుతోంది.
30 షేర్ల ఇండెక్స్‌లో పవర్ గ్రిడ్, ఐటీసీ తప్ప మిగతా కంపెనీలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. మారుతీ షేర్లు 12.53 శాతానికి పైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.
10:06 March 19
అదే తీరు..
స్టాక్ మార్కెట్లు ఇంకా భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెషన్ ప్రారంభమైన గంట తర్వాత సెన్సెక్స్ 1,787 పాయింట్ల నష్టంతో 27,082 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 521 పాయింట్లు కోల్పోయి7,947 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
30 షేర్ల ఇండెక్స్‌లో పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఐటీసీ తప్ప మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్ ఫినాన్స్ అత్యధికంగా 18 శాతానికి పైగా నష్టంతో కొనసాగుతోంది.
09:26 March 19
భయం.. భయం..
స్టాక్ మార్కెట్లను భారీ నష్టాలు కుదిపేస్తున్నాయి. ప్రారంభమైన కాసేపటికే సెన్సెక్స్ 1,930 పాయింట్లకు పైగా పతనమైంది. ప్రస్తుతం 26,938 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ ఏకంగా 557 పాయింట్లు కోల్పోయి ప్రస్తుతం 7,911 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
30 షేర్ల ఇండెక్స్‌లో పవర్ గ్రిడ్ మినహా మిగతా అన్ని షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.
08:12 March 19
ఆరంభంలోనే భారీ నష్టాలు..
కరోనా భయాలతో స్టాక్ మార్కెట్లు నేడూ భారీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ప్రీసెషన్లోనే సూచీలు కుదేలవుతున్నాయి. దేశంలో కొవిడ్- 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటిస్తున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1,096 పాయింట్లకు పైగా నష్టంతో.. ప్రస్తుతం 27,773 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 405 పాయింట్లకు పైగా క్షీణతతో 8,063 వద్ద కొనసాగుతోంది.