చివరి సెషన్లో భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు ఇవాళ కుప్పకూలాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడమే ఇందుకు కారణం. ఒక దశలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 750 పాయింట్లకుపైగా నష్టపోయింది. చివరకు 695 పాయింట్లు కోల్పోయి.. 43 వేల 828 వద్ద సెషన్‌ను ముగించింది.
ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 44 వేల 825 పాయింట్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. అనంతరం.. ఏ కుదేలైన సూచీ ఏ దశలోనూ కోలుకోలేదు.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 197 పాయింట్లు క్షీణించి.. 12 వేల 858 వద్ద స్థిరపడింది.