వృద్ధి మందగమనానికి మందు వేసే దిశగా ఆర్బీఐ, ఆర్థికశాఖ చేపడుతున్న చర్యలకు తోడు అంతర్జాతీయ సానుకూల పవనాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభపడ్డాయి. ముఖ్యంగా దేశీయ బ్యాంకింగ్, ఐటీ, ఎనర్జీ రంగాలు వృద్ధి చెందడం, అమెరికా-చైనా వాణిజ్య చర్చల పునరుద్ధరణతో విదేశీ మదుపరుల సెంటిమెంట్ బలపడడమూ ఇందుకు కారణమే.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 337 పాయింట్లు వృద్ధి చెంది 36 వేల 981 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 98 పాయింట్లు లాభపడి 10 వేల 946 వద్ద స్థిరపడింది.
లాభాల్లో
టెక్ మహీంద్రా, మారుతీ సుజూకీ, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, ఎమ్ అండ్ ఎమ్, వేదాంత, రిలయన్స్ 3.77 శాతం మేర రాణించాయి.
నష్టాల్లో
ఎస్ బ్యాంకు, సన్‌ఫార్మా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, హెచ్‌యూఎల్, సిప్లా, బ్రిటానియా, ఐటీసీ 2.42 శాతం డీలాపడ్డాయి.