తెలంగాణ

telangana

ETV Bharat / business

సర్వత్రా ప్రతికూలం... మార్కెట్లకు భారీ నష్టం - భారీ నష్టాల్లో స్టాక్​మార్కెట్లు

దేశీయ స్టాక్​మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, దేశీయ మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమే ఇందుకు కారణం.

సర్వత్రా ప్రతికూలం... మార్కెట్లకు భారీ నష్టం

By

Published : Sep 25, 2019, 3:58 PM IST

Updated : Oct 1, 2019, 11:42 PM IST

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలతో దేశీయ స్టాక్​మార్కెట్లు కుదేలయ్యాయి. రికార్డు స్థాయి లాభాల తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమూ ఇందుకు తోడైంది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్​మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోకపోవడం గమనార్హం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 504 పాయింట్లు కోల్పోయి 38 వేల 594 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 148 పాయింట్లు నష్టపోయి 11 వేల 440 వద్ద స్థిరపడింది.

లాభాల్లో

పవర్​గ్రిడ్​ కార్ప్​, టీసీఎస్​, ఎన్​టీపీసీ, ఐఓసీ, బీపీసీఎల్, హెచ్​సీఎల్​ టెక్​, హెచ్​యూఎల్​ రాణించాయి.

నష్టాల్లో

ఎస్​బీఐ, టాటా మోటార్స్, మారుతీ సుజూకీ, ఐషర్​ మోటార్స్, ఎమ్​ అండ్​ ఎమ్​, ఎస్ బ్యాంకు నష్టాలపాలయ్యాయి.

ఆసియా మార్కెట్లు

నిక్కీ, హాంగ్​సెంగ్​, కోస్పీ, షాంగై కాంపోజిట్​లు కూడా నష్టాలు చవిచూశాయి.

ఇదీ చూడండి: రెడ్​మీ సూపర్​ బడ్జెట్​ ఫోన్​పై భారీ డిస్కౌంట్​ ఆఫర్!

Last Updated : Oct 1, 2019, 11:42 PM IST

ABOUT THE AUTHOR

...view details