స్టాక్మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. విదేశీ పెట్టుబడుల ప్రవాహం, రూపాయి బలోపేతం, అమెరికా-చైనా వాణిజ్య చర్చలు సత్ఫలితాలు ఇస్తాయన్న అంచనాలు ఇందుకు కారణమయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 127.19 పాయింట్లు లాభపడి 38,675 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 53.90 పాయింట్ల లాభంతో నిర్ణయాత్మక 11,600 పాయింట్ల స్థాయిని తాకింది. సెషన్ ముగిసే సమయానికి 11,623.90 వద్ద స్థిరపడింది.
ఇదీ కారణం
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు దేశీయ పెట్టుబడులు నేటి లాభాలకు ప్రధాన కారణం. వాహన, చమురు రంగ షేర్ల కొనుగోళ్లపై మదుపరులు ఆసక్తి చూపారు.
నిన్నటి భారీ లాభాలకు కారణమైన ఆర్థిక రంగ షేర్లు మాత్రం నేడు లాభాల స్వీకరణతో డీలా పడ్డాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సూచీ | గరిష్ఠం | కనిష్ఠం |
సెన్సెక్స్ | 38,748.54 | 38,546.68 |
నిఫ్టీ | 11,630.35 | 11,570.15 |