తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా భయాలు... భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

అంతర్జాతీయంగా నెలకొన్న కరోనా వైరస్ భయాలు, ముడిచమురు ధరల పతనంతో స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్ 1452 పాయింట్ల నష్టంతో 36, 124 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ సూచీ నిఫ్టీ 406 క్షీణించి 10,566 గా ట్రేడవుతోంది.

stocks
కరోనా భయాలతో భారీ నష్టాల్లో మార్కెట్లు!

By

Published : Mar 9, 2020, 10:02 AM IST

Updated : Mar 9, 2020, 10:22 AM IST

ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ విస్తరిస్తుండటం కారణంగా మదుపరుల్లో నెలకొన్న ఆందోళనలు, ముడిచమురు ధరల్లో 30 శాతం మేర క్షీణించడం కారణంగా స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1452 పాయింట్లు కోల్పోయి 36,124 వద్ద ఉంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 406 క్షీణించి 10, 582 గా ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

ఎస్​బ్యాంక్, హిందుస్థాన్ పెట్రోలియం, బీపీసీఎల్, స్పైస్ జెట్, ఎంఆర్​పీఎల్, ఐఓసీఎల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఓఎన్​జీసీ, రిలయన్స్ ఇన్​ఫ్రా, ఎల్ అండ్ టీ, ఇండస్​ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి క్షీణత

డాలరు మారకం విలువతో పోలిస్తే రూపాయి విలువ 30 పైసలు క్షీణించి 74 గా ఉంది.

ఆసియా మార్కెట్లు

ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. షాంఘై మార్కెట్ 2 శాతం, హాంకాంగ్, సియోల్ మార్కెట్లు 3 శాతం, టోక్యో సూచీ 5 శాతం మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:ఈక్విటీల్లోనే 82% మంది మహిళల పెట్టుబడులు

Last Updated : Mar 9, 2020, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details