తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫెడ్​ నిర్ణయానికి ముందు నష్టాల్లో మార్కెట్లు - అమెరికా

వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్​ రిజర్వ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనల మధ్య స్టాక్​మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 200 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 10 వేల 800 దిగువకు చేరింది.

ఫెడ్​ నిర్ణయానికి ముందు నష్టాల్లో మార్కెట్లు

By

Published : Jun 17, 2019, 10:10 AM IST

స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లు కోల్పోయి... 39 వేల 250 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ... 64 పాయింట్లు పతనమై.. 11 వేల 800 దిగువకు చేరింది. ప్రస్తుతం.. 11 వేల 760 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

వడ్డీ రేట్లపై జూన్​ 19న అమెరికా ఫెడ్​ నిర్ణయం వెలువడడానికి ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరించడమే నేటి నష్టాలకు కారణం.

లాభనష్టాల్లోనివివే....

ఇండియాబుల్స్​ హెచ్​ఎస్​జీ, భారతి ఇన్​ఫ్రాటెల్ లిమిటెడ్​, యస్​ బ్యాంక్​, విప్రో, ఏషియన్​ పెయింట్స్​ అత్యధిక లాభాల్లో ఉన్నాయి.

జేఎస్​డబ్ల్యూ స్టీల్​, వేదాంత, టాటా స్టీల్​, రిలయన్స్​ నష్టాల జాబితాలో ఉన్నాయి.

రూపాయి ట్రేడింగ్​ ఫ్లాట్​గా ప్రారంభమైంది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే మారకం విలువ 69.80 వద్ద ఉంది.

అంతర్జాతీయంగా మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details