తెలంగాణ

telangana

ETV Bharat / business

వారాంతంలో భారీ నష్టాలు- సెన్సెక్స్ 634 మైనస్​

stocks markets today
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : Sep 4, 2020, 9:26 AM IST

Updated : Sep 4, 2020, 4:30 PM IST

15:47 September 04

బ్యాంకింగ్ షేర్లు కుదేలు

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​ను భారీ నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్ 634 పాయింట్లు తగ్గి 38,357 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 194 పాయింట్ల నష్టంతో 11,334 వద్దకు చేరింది.

ఆరంభం నుంచే నష్టాల్లో ఉన్న సూచీలు ఏ దశలోనూ తేరుకోలేదు. అన్ని రంగాలు ఒడుదొడుకులు ఎదుర్కొనగా.. బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి.

  • 30 షేర్ల ఇండెక్స్​లో మారుతీ మాత్రమే లాభపడింది.
  • యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్, ఎస్​బీఐ, సన్​ఫార్మా షేర్లు భారీగా నష్టపోయాయి.

12:06 September 04

నష్టాల్లోనూ మారుతీ సానుకూలం..

స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్ తర్వాత కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 450 పాయింట్లకుపైగా క్షీణతతో 38,538 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లకుపైగా నష్టంతో 11,394 వద్ద కొనసాగుతోంది.

  • బ్యాంకింగ్ షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.
  • 30 షేర్ల ఇండెక్స్​లో మారుతీ, టీసీఎస్​, బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్​లు మాత్రమే స్వల్ప లాభాల్లో ఉన్నాయి.
  • ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్​బీఐ, పవర్​గ్రిడ్ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:03 September 04

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

30 షేర్ల ఇండెక్స్

స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​లో భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ దాదాపు 580 పాయింట్ల నష్టంతో 38,413 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 170 పాయింట్లకుపైగా కోల్పోయి 11,354 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయంగా అమెరికా మార్కెట్లు గురువారం సెషన్​లో భారీ నష్టాలను నమోదు చేయడం దేశీయ మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో వారంతా అమ్మకాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

బ్యాంకింగ్ షేర్లు అత్యధికంగా నష్టాల్లో ఉన్నాయి. 30 షేర్ల ఇండెక్స్​లో అన్ని కంపెనీలు నష్టాల్లోనే ఉండటం గమనార్హం.

Last Updated : Sep 4, 2020, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details