తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకింగ్​ షేర్ల దన్నుతో వరుసగా ఐదో సెషన్​లో లాభాలే - సెన్సెక్స్

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : Aug 27, 2020, 9:28 AM IST

Updated : Aug 27, 2020, 3:54 PM IST

15:51 August 27

దేశీయ స్టాక్​ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమైనా.. అమ్మకాల ఒత్తిడితో చివరి సెషన్​లో ఒడుదొడుకులకు లోనయ్యాయి. చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్​ షేర్లు భారీ లాభాలను ఆర్జించాయి. 

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 40 పాయింట్ల లాభంతో 39,113 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 10 పెరిగి 11,559 పాయింట్లకు చేరింది.

11:48 August 27

బజాజ్ షేర్లు డీలా..

మిడ్​ సెషన్ ముందు స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా లాభంతో 39,236 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల వృద్ధితో 11,596 వద్ద కొనసాగుతోంది. 

ఆర్థిక, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఎం&ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

బజాజ్ ఆటో, బజాజ్​ ఫిన్​సర్వ్, బజాజ్​ ఫినాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

08:52 August 27

సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 170 పాయింట్లకుపైగా బలపడి 39,249 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల లాభంతో 11,609 వద్ద కొనసాగుతోంది. 

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలు లాభాలకు కలిసొస్తున్నాయి.

  • ఐటీసీ, ఎం&ఎం, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, పవర్​గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • బజాజ్ ఆటో, భారతీ ఎయిర్​టెల్, హెచ్​యూఎల్​, హెచ్​సీఎల్​టెక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Last Updated : Aug 27, 2020, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details