తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్ షేర్ల జోరుతో వరుస నష్టాలకు చెక్ - సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. హెవీ వెయిట్ షేర్ల దన్నుతో సెన్సెక్స్ 748 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 211 పాయింట్లు పుంజుకుని తిరిగి 11 వేల మార్క్​ను దాటింది.

stocks close in huge profits
భారీ లాభాల్లో ముగిసి మార్కెట్లు

By

Published : Aug 4, 2020, 3:43 PM IST

వరుసగా నాలుగు రోజుల నష్టాలకు చెక్​ పెడుతూ.. స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి.

బీఎస్​ఈ-సెన్సెక్స్ 748 పాయింట్లు పుంజుకుని 37,688 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 211 పాయింట్ల లాభంతో తిరిగి 11,103 వద్ద స్థిరపడింది.

సోమవారం సెషన్​లో అమెరికా సహా అంతర్జాతీయంగా ఇతర మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. దీనితో దేశీయ మదుపరుల సెంటిమెంట్ బలపడింది. వీటికి తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు భారీగా పుంజుకోవడం లాభాలకు కలిసొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 37,724 పాయింట్ల అత్యధిక స్థాయి, 36,988 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,112 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 10,908 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా 7 శాతం లాభపడింది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, మారుతీ, యాక్సిస్​ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

టెక్ మహీంద్రా, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు..

ఆసియాలో ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, టోక్యో, సియోల్​, హాంకాంగ్ సూచీలూ మంగళవారం భారీ లాభాలను నమోదు చేశాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్​లో రూపాయి 3 పైసలు కోల్పోయింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.75.04 వద్దకు చేరింది.

ఇదీ చూడండి:వ్యవసాయ రంగం అండతోనే కరోనా సంక్షోభం దూరం!

ABOUT THE AUTHOR

...view details