తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ ప్రతికూలతలతో.. మూడోరోజూ నష్టాలు

వారాంతపు సెషన్​లో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 129 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 29 పాయింట్లు నష్టపోయింది. హెవీ వెయిట్​ షేర్లలో అమ్మకాలు, అంతర్జాతీయ ప్రతికూలతలు నష్టాలకు ప్రధాన కారణం.

stock markets today
నేటి స్టాక్​ మార్కెట్లు

By

Published : Jul 31, 2020, 3:46 PM IST

స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 129 పాయింట్లు కోల్పోయి 37,607 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో 11,073 వద్ద స్థిరపడింది.

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు భారీగా క్షీణించినట్లు నివేదికలు వెలువడటం మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీసింది. దీనితో అమ్మకాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా హెవీ వెయిట్ షేర్లలో నమోదైన అమ్మకాలు నష్టాలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు మార్కెట్​ నిపుణులు.

ఒడుదొడుకుల్లోనూ ఫార్మా, ఆటో, ఐటీ షేర్లు సానుకూలంగా స్పందించడం గమనార్హం.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 37,898 పాయింట్ల అత్యధిక స్థాయి, 37,432 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,150 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 11,027 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

సన్​ఫార్మా, ఎస్​బీఐ, ఎం&ఎం, యాక్సిస్​ బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్, బజాజ్​ ఫినాన్స్ షేర్లు లాభపడ్డాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఆసియా మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయి హాంకాంగ్​, టోక్యో, సియోల్​ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. షాంఘై సూచీ మాత్రమే లాభపడింది.

రూపాయి..

కరెన్సీ మార్కెట్​లో రూపాయి శుక్రవారం 3 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.74.81 వద్ద ఉంది.

ఇదీ చూడండి:టీవీల దిగుమతులపై కేంద్రం కొత్త ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details