తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుస నష్టాలకు చెక్​- 59వేలపైకి సెన్సెక్స్ - షేర్ మార్కెట్ ఇంట్రాడే

స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. మంగళవారం సెషన్​లో సెన్సెక్స్ (Sensex Today) 514 పాయింట్లు పెరిగి.. 59 వేల మార్క్​ దాటింది. నిఫ్టీ (Nifty Today) 165 పాయింట్ల లాభంతో 17,550 ఎగువకు చేరింది.

Bull run in Stock Market
స్టాక్ మార్కెట్లలో బుల్​ జోరు

By

Published : Sep 21, 2021, 3:41 PM IST

ఒడుదొడుకుల సెషన్​లో స్టాక్ మార్కెట్లు (Stock Market) భారీ లాభాలతో ముగిశాయి. బుల్​ విజృంభణతో బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 514 పాయింట్లు పెరిగి 59,005వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 165 పాయింట్ల లాభంతో 17,562 వద్దకు చేరింది.

ఫినాన్స్​, బ్యాంకింగ్, ఐటీ షేర్లు సానుకూలంగా స్పందించడం లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పలు కంపెనీల షేర్లు 52 వారాల గరిష్ఠాన్ని కూడా తాకాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 59,084 పాయింట్ల అత్యధిక స్థాయి, 58,232 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 17,578 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,326 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

బజాజ్​ ఫినాన్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్​, టాటా స్టీల్​, ఐటీసీ (52 వారాల గరిష్ఠం), బజాజ్​ ఫిన్​సర్వ్​ లాభాలను గడించాయి.

మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో, నెస్లే ఇండియా, పవర్​గ్రిడ్​, యాక్సిస్​ బ్యాంక్ అధికంగా నష్టపోయాయి

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) సూచీ లాభాలను గడించింది. నిక్కీ (జపాన్​) భారీ నష్టాలతో ముగిసింది. షాంఘై (చైనా), కోస్పీ (దక్షిణ కొరియా) సూచీలు సెలవులో ఉన్నాయి.

ఇదీ చదవండి:గూగుల్ నుంచి 'ఒరిజినల్​ ఆలు చిప్స్'​- మీకూ కావాలా?

ABOUT THE AUTHOR

...view details