ఆర్థిక మందగమనం, రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవడానికి తోడు పారిశ్రామికోత్పత్తి క్షీణించిన నేపథ్యంలో మదుపరుల సెంటిమెంటు దెబ్బతింది. ఫలితంగా ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 33 పాయింట్లు కోల్పోయి 41 వేల 648 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 12 వేల 214 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో
ఎస్ బ్యాంకు, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హిందాల్కో, భారతీ ఇన్ఫ్రాటెల్, నెస్లే, ఓఎన్జీసీ, టైటాన్ కంపెనీ రాణిస్తున్నాయి.
హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంకు, యూపీఎల్, జేఎస్డబ్ల్యూ, హెచ్యూఎల్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో నేలచూపులు చూస్తున్నాయి.