దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాక్సిన్‌పై చిగురిస్తున్న ఆశలు మదుపరుల సెంటిమెంట్‌ను పెంచడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి 355 పాయింట్లు లాభపడి 30 వేల 551 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి నిఫ్టీ 105 పాయింట్లు వృద్ధిచెంది 8 వేల 985 వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం కలిగిస్తున్న ఆందోళనలతో దేశాలు రక్షణాత్మక విధానాల వైపు మొగ్గుచూపుతున్నాయి. మరోవైపు కరోనా భయాలు వెంటాడుతునే ఉన్నాయి. అయినప్పటికీ దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టడం గమనార్హం.
లాభనష్టాల్లో